Advertisement

Advertisement


Home > Movies - Movie News

శ్వేతారెడ్డి ఆరోపణలు నిలబడతాయా?

శ్వేతారెడ్డి ఆరోపణలు నిలబడతాయా?

స్టార్ మా రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 మీద నీలినీడలు ముసురుకుంటున్నాయి. షో నిర్వాహకులపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. యాంకర్ శ్వేతారెడ్డి ఇప్పటివరకు మీడియా ముందుకు మాత్రమే వచ్చారు. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆమెను బిగ్ బాస్ నిర్వాహకులు లైంగికంగా వేధించారన్నది ఫిర్యాదు.

బిగ్ బాస్ ప్రోగ్రామ్ కు సంబంధించి రఘు, శ్యామ్ లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసారు. తమ బాస్ లను తగిన విధంగా తృప్తి పరచాలి అనే అర్థంవచ్చేలా వారు మాట్లాడారన్నది శ్వేతారెడ్డి ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. అదికాక తన దగ్గర ఓ అగ్రిమెంట్ మీద సంతకాలు తీసుకున్నారని, దాని జిరాక్స్ ఇవ్వలేదని అన్నది ఆమె మరో ఆరోపణ.

అయితే ఇవున్నీ లీగల్ గా ఏ మేరకు నిలుస్తాయన్నది చూడాల్సివుంది. ఎందుకంటే బిగ్ బాస్ నిర్వాహకులు దేశవ్యాప్తంగా ఈ షో చేస్తున్నారు. వారు చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమానికి బ్యాక్ గ్రవుండ్ వర్క్ చేస్తున్నారు. ఎవర్ని కాంట్రాక్ట్ చేస్తున్నారో వారి దగ్గర నుంచి ముందుగా ఓ ప్రిలిమనరీ అగ్రిమెంట్ తీసుకుంటున్నారు. షోకి సెలెక్ట్ చేయవచ్చు, చేయకపోవచ్చు అన్నది క్లాజ్ ఆ అగ్రిమెంట్ లో వుంటుంది.

పైగా షో కోసం వాళ్లకు కావాల్సినంత మంది కన్నా, మూడింతలు ఎక్కువ మందిని కాంట్రాక్ట్ చేస్తారు. వివిధ రకాలైన వృత్తి నిపుణులు, సైకాలజిస్ట్ ల సహకారంతో నలభైమంది వరకు ఫైనల్ లిస్ట్ లోకి చేరుస్తారు. అక్కడి నుంచి ఫైనల్ లిస్ట్ తయారవుతుంది. మరి ఇక్కడ మాత్రం ఏమైనా పైరవీలు, ఇతరత్రా వ్యవహారాలు వుంటాయో, వుండవో, అన్నది తెలియని సంగతి. అది పార్టిసిపెంట్స్, నిర్వాహకుల మధ్య వ్యవహారం.

శ్వేతారెడ్డి చేస్తున్న ఆరోపణలు కేవలం మౌఖికమా? లేక సాక్ష్యాలు ఏమైనా వున్నాయా? అన్నది ఇంకా తెలియదు. పోలీసులకు ఆమె కేవలం ఫిర్యాదు చేసారా? లేక సాక్ష్యాలు అంటే ఫోన్ రికార్డ్ లు, లేదా రెస్టారెంట్ లో కలిసినపుడు సిసి కెమేరా రికార్డుల వంటివి ఏమైనా వున్నాయా? అన్నది తెలియాల్సి వుంది.

రఘు, శ్యామ్ అనేవారు ఈ షోకి సంబంధించి చాలా ఎర్లీ స్టేజ్ లో వుండే కో ఆర్డినేటర్లు మాత్రమే. వారి మీద చాలా స్థాయి అధికార  బృందం వుంటుంది. మరి వీరు ఏ మేరకు వారిని ప్రభావితం చేయగలరు? లేదా ఆ అధికార బృందం వీరిని ఏ మేరకు వాడుకుంటుంది అన్నది కూడా తెలియాల్సి వుంది.

కేవలం తనను ఫైనల్ లిస్ట్ లోకి ఎంపిక చేయడం లేదని తెలిసిన తరువాత శ్వేతారెడ్డి ఈ ఆరోపణలు చేస్తున్నారన్నది స్టార్ మా వర్గాల వాదన అని తెలుస్తోంది. తమ దగ్గర పకడ్బందీ అగ్రిమెంట్ వుందని, ఇలాంటి ఆరోపణలు ఏవీ నిలవవని ఆ వర్గాలు అంటున్నాయి. మరి పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి.

సందీప్ చెప్పినట్లే సినిమా ఉందా? అపజయాల నుంచి బయటపడేనా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?