Advertisement

Advertisement


Home > Movies - Movie News

స్పీడ్ లేని రాజ్ దూత్

స్పీడ్ లేని రాజ్ దూత్

మంచి నటుడిగా, అంతకన్నా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుని, తక్కువ వయసులోనే మరణించిన శ్రీహరి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు మేఘాంశ్. చాలా సైలెంట్ గా కాస్త డిఫరెంట్ సినిమా అనిపించుకునేలా రాజ్ దూత్ అనే సినిమా చేసేసాడు. చేయాల్సినంత హడావుడి చేసారు. ఇండస్ట్రీ పరిచయాలు కొంతవరకు వినియోగించుకున్నారు. సినిమాను విడుదల చేసారు.

కానీ అస్సలు ఓపెనింగ్స్ అన్నది లేకపోవడం ఆశ్చర్యం. ఈ శుక్రవారం విడుదలైన నిను వీడని నీడను నేనే, దొరసాని సినిమాలు అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చుకోకపోయినా, కాస్త మంచి అంకెలే కనబడ్డాయి. రెండోరోజు కూడా ఫరవాలేదు అన్నట్లే వున్నాయి. కానీ రాజ్ దూత్ మాత్రం తొలిరోజు మార్నింగ్ షో నుంచి కూడా జస్ట్ థియేటర్ ఖర్చులు కిట్టుబాటు అవుతాయా? లేదా? అన్నట్లుగానే అంకెలు కనిపిస్తున్నాయి.

వాస్తవానికి ఇప్పుడు థియేటర్ల సమస్యలేదు. ఎందుకంటే థియేటర్లలో తిష్టవేసుకుని కూర్చునేంత సినిమాలు ఏవీలేవు. అందువల్ల రాజ్ దూత్ కు థియేటర్ల సమస్య రాలేదు. చిన్న చిన్న సెంటర్లలో కూడా థియేటర్లు దొరికాయి. కానీ కలెక్షన్లు మాత్రం కనిపించకపోవడం ఆశ్చర్యం.

అలా అని పోటీగా పెద్ద సినిమాలు ఏమైనా విడుదలయ్యాయా? అంటే అదీ లేదు. రాజ్ దూత్ తో పాటు విడుదలైన దొరసానిలో ఇద్దరు నటులు కొత్తవారే. అలాగే నినువీడని నీడను నేనేలో హీరో సందీప్ సరైన హిట్ లేకుండా వున్నాడు. కానీ ఆ రెండు సినిమాలకు కనిపిస్తున్న కలెక్షన్లలో పదోవంతు కూడా రాజ్ దూత్ కు కనిపించకపోవడం ఆశ్చర్యం.

సినిమాను మరింత బలంగా జనాల్లోకి తీసుకెళ్లి వుండాల్సిందేమో? చిత్రమేమిటంటే అసలు క్రిటిక్స్ కూడా ఈ సినిమాను పట్టించుకోకపోవడం. ఎక్కడా ఒక్క సమీక్ష కూడా కనిపించకపోవడం. శ్రీహరి వారసుడిగా మేఘాంశ్ మలి ప్రయత్నం అయినా గట్టిగా చేయాల్సివుంది.

సందీప్ చెప్పినట్లే సినిమా ఉందా? అపజయాల నుంచి బయటపడేనా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?