టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ టైటిల్స్ లో ఒకటి స్వాతిముత్యం. ఇలాంటి టైటిల్ తో వస్తోంది సితార సంస్థ బెల్లంకొండ గణేష్ తో నిర్మిస్తున్న సినిమా. కొత్త దర్శకుడు లక్షణ్ రూపొందిస్తున్న ఈ చిత్రం ట్రయిలర్ ను విడుదల చేసారు.
ట్రయిలర్ లో కథేంటీ అన్నది అస్సలు క్లారిటీ ఇవ్వకుండా, అదే సమయంలో చిన్న కన్ఫూజ్ కామెడీ వున్న ఫీల్ కలిగిస్తూ ట్రయిలర్ ను కట్ చేసారు. ట్రయిలర్ ఓ ఇన్నోసెంట్ అబ్బాయికీ, ఓ నెమ్మదైన అమ్మాయికి నడుమ ప్రేమ చిగురించడం దగ్గర ప్రారంభించి, కథను మలుపుతిప్పే ఏదో పాయింట్ దగ్గరకు తీసుకెళ్లి, ఆపై ఎమోషన్ టచ్ ఇచ్చారు. అలా అని కేవలం ఎమోషన్ మీద వెళ్లకుండా మళ్లీ ఫన్ నోట్ జాయింట్ చేసారు.
దాదాపు కీలకమైన పాత్రలన్నీ ఫన్ టోన్ తోనే వున్నాయి. హీరో, హీరోయిన్లు, వెన్నెల కిషోర్, రావు రమేష్, ప్రగతి, సీనియర్ నరేష్, గోపరాజు రమణ, ఇలా అంతా. గోదావరి ప్రాంత బ్యాక్ డ్రాప్ లో నడిచే కథను మల్టీ జానర్ తో తయారు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇటు ఫన్, యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు, ఫ్యామిలీ ఎమోషన్లు కూడా సినిమాలో వున్నాయని ట్రయిలర్ ద్వారా శాంపిల్ చూపించినట్లుంది.
రెగ్యులర్ రోమ్ కామ్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాదని, ఓ ప్రోబ్లమ్ ను డిస్కస్ చేసామని దర్శకుడు చెబుతున్నాడు కాబట్టి, ట్రయిలర్ లో అసలు విషయం దాచారన్నది క్లారిటీగా తెలుస్తోంది.