బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అందులో సందేహం లేదు. సాధారణంగా ఇలాంటి టాక్ షో ల్లో ప్రశ్నలు, సమాదానాలు ఆశువుగా వుంటాయని అందరూ అనుకుంటారు.
కాదు అంతా మ్యాచ్ ఫిక్స్ మోడ్ లో సాగుతుందని ఇప్పడు క్లారిటీగా తెలుస్తోంది. ఈ షో వెనుక వున్న టీమ్ లో ఒక మెంబర్ అయిన రైటర్, దర్శకుడు బివిఎస్ రవి చెప్పిన దాన్ని బట్టి ఇలా అనుకోవాల్సి వస్తోంది.
సీనియర్ నటుడు మోహన్ బాబుతో చాట్ షో చేయడానికి వీలుగా క్వశ్చన్లు అన్నీ ముందుగా ప్రిపేర్ చేసారట. వాటిని బాలయ్యకు ఇచ్చారట, మోహన్ బాబుకు ముందే ఇచ్చారట. బాలయ్యకు ఇంటర్వూ ప్రశ్నలు అన్నీ ప్రిపేర్ చేసి ఇస్తే, మోహన్ బాబు కూ చెప్పారా అని అడిగి కన్ ఫర్మ్ చేసుకున్నారట.
అంటే అడిగే ప్రశ్శలు బాలయ్య క్రియేటివిటీ కాదు. సమాధానాలు సడెన్ గా చెప్పినవీ కాదన్న మాట. బాలయ్య చెవిలో చిన్న మైక్ సెట్ చేసి, దాని ద్వారా ఆయనకు ప్రాప్టింగ్ ఇవ్వడం జరిగిందట. వాటిని బట్టి బాలయ్య ఇంప్రూవైజ్ చేసి షో ను రక్తి కట్టించారన్నమాట.
తాము తయారు చేసిన క్వశ్చన్లను బాలయ్య తన బాడీ లాంగ్వేజ్ తో వేరే లెవెల్ కు తీసుకెళ్లారని బివిఎస్ రవి చెప్పారు. బ్రహ్మానందం ను స్టేజ్ మీదకు వస్తే వెనక్కు వెళ్లిపొమ్మని చెప్పడం, ఆ తరువాత పల్లకీలో తీసుకురావడం ఇదంతా ముందుగా ప్లాన్ చేసిందే అని వెల్లడించారు.