Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెళ్లిపై మిల్కీబ్యూటీ స్పందన ఇది

పెళ్లిపై మిల్కీబ్యూటీ స్పందన ఇది

కాజల్, తమన్న మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. కాజల్ పెళ్లి చేసుకుంది, మరి తమన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది. ఇదే ఇప్పుడు అందరి ప్రశ్న. ఇప్పటివరకు ఆమె ఎవరితో డేటింగ్ లో ఉన్నట్టు కూడా పుకార్లు రాలేదు. ఈ నేపథ్యంలో మిల్కీబ్యూటీ తన పెళ్లిపై స్పందించింది. మరో రెండేళ్ల వరకు పెళ్లి ఆలోచన చేయనని క్లియర్ గా చెబుతోంది.

నిజానికి రెండేళ్ల కిందట తమన్న పెళ్లి చేసుకోవాలనుకుంది. అప్పట్లో ఆమె కెరీర్ డల్ గా సాగింది. దీంతో ఆమె తనపై వచ్చిన పెళ్లి పుకార్లను కూడా ఖండించలేదు. అంటే, ఆమె పెళ్లి ప్రయత్నాలు చేసినట్టే. కానీ ఊహించని విధంగా తమన్న కెరీర్ మరోసారి ఊపందుకుంది. ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టుకు కోటిన్నర నుంచి 2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. దీంతో మరో రెండేళ్ల పాటు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది మిల్కీబ్యూటీ.

ప్రస్తుతం ఎఫ్3 సినిమాలో నటిస్తోంది తమన్న. త్వరలోనే చిరంజీవితో కలిసి భోళాశంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. వీటితో పాటు కన్నడలో ఓ పాన్ ఇండియా సినిమాకు సైన్ చేసింది. ఇక ఆమె నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా విడుదలకు సిద్ధమైంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమాలో ఓ ఐటెంసాంగ్ చేసింది.

ఇలా సౌత్ లో మరోసారి క్రేజ్ పెరగడంతో పెళ్లిని కొన్నాళ్లు పక్కనపెట్టింది తమన్న. ఈ విషయంలో తన ఫ్రెండ్ కాజల్ తో తనను పోల్చవద్దని కోరుతోంది. సినిమాలతో పాటు వెబ్ కంటెంట్ కు కూడా ఓకే చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?