Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ హీరోయిన్ పెళ్లి కూడా ఇండియాలోనే..!

ఈ హీరోయిన్ పెళ్లి కూడా ఇండియాలోనే..!

హీరోయిన్లంతా వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అక్ష, కృతి కర్బందా, సోనారికా, మీరా చోప్రా.. వీళ్లంతా రీసెంట్ గా వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. లిస్ట్ లో నెక్ట్స్ వినిపిస్తున్న పేరు తమన్నది మాత్రమే. ఈమె కూడా పెళ్లికి సిద్ధమని ప్రకటించింది. అయితే అది ఎప్పుడనేది అప్పుడే చెప్పలేనని కూడా ప్రకటించింది.

అయితే తమన్న-విజయ్ వర్మ మాత్రం పెళ్లి ఏర్పాట్లలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వీళ్లిద్దరూ తమ పెళ్లి కోసం డెస్టినేషన్ ను వెదికే పనిలో పడ్డారు. ప్రస్తుతం సెలబ్రిటీలంతా ఇండియాలోనే పెళ్లిళ్లు చేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. తమన్నా-విజయ్ కూడా అదే లైన్లో ఉన్నారు.

ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని వీళ్లు ప్రాధమికంగా నిర్ణయించుకున్నారు. ఇండియాలో ఎక్కడనే విషయాన్ని వీళ్లింకా లాక్ చేయలేదు. మరికొన్ని రోజుల్లో ఆ మేటర్ కూడా బయటకొస్తుంది.

లివ్-ఇన్ లో ఉన్నారా.. మరోవైపు తమన్నా-విజయ్ వర్మపై సరికొత్త పుకార్లు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో హాట్ లవ్ బర్డ్స్ గా కొనసాగుతున్న ఈ జంట.. ప్రస్తుతం సహజీవనం చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అవును.. ముంబయిలో తమన్న-విజయ్ ఒకే ఫ్లాట్ లో కలిసి ఉంటున్నారట. దీని వల్ల వాళ్లకు మరింత సమయం ఆదా అవుతోందంట.

ప్రస్తుతం వీళ్లిద్దరూ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తమన్న అయితే బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. దీంతో ఇద్దరూ కలిసి ప్రేమించుకోవడానికి టైమ్ సరిపోవడం లేదంట. అందుకే సమయాన్ని ఆదా చేసేందుకు ఇద్దరూ ఒకే ఫ్లాట్ లో ఉంటున్నారనేది బాలీవుడ్ మీడియా కథనం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?