సూపర్ హిట్ సీక్వెల్ లో ఆ హీరోయిన్ ఉంటుందా?

హీరో విశాల్ ఉన్నట్టుండి సడెన్ గా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తన పాతికేళ్ల కల నెరవేరే సమయం వచ్చిందంటూ ఘనంగా ప్రకటించుకున్న విశాల్.. డిటెక్టివ్ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు తెలిపాడు. ఈ సినిమాతో…

హీరో విశాల్ ఉన్నట్టుండి సడెన్ గా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తన పాతికేళ్ల కల నెరవేరే సమయం వచ్చిందంటూ ఘనంగా ప్రకటించుకున్న విశాల్.. డిటెక్టివ్ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు తెలిపాడు. ఈ సినిమాతో విశాల్ మెగాఫోన్ పట్టబోతున్నాడు. అంతా బాగానే ఉంది కానీ, హీరోయిన్ సంగతేంటి?

డిటెక్టివ్ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. మరి సీక్వెల్ లో ఆమె ఉంటుందా ఉండదా? సాధారణంగా సినిమాకు సీక్వెల్ తీస్తున్నప్పుడు ఇలాంటి అనుమానాలు ఎవ్వరికీ రావు. మొదటి భాగంలో ఉన్న నటీనటులు మ్యాగ్జిమమ్ పార్ట్-2లో కూడా కొనసాగుతారు.

కానీ అను ఎమ్మాన్యుయేల్ పరిస్థితి వేరు. డిటెక్టివ్ మొదటి భాగంలోనే ఆమెకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇంకా చెప్పాలంటే మెయిన్ కథకు, హీరోయిన్ రోల్ కు అస్సలు సంబంధం లేదు. మరి అలాంటి క్యారెక్టర్ ను సీక్వెల్ లో విశాల్ ఉంచుతాడా లేపేస్తాడా అనేది అనుమానం.

విశాల్ సినిమాల్లో హీరోయిన్ ఉండాల్సిందే. కాబట్టి డిటెక్టివ్-2లో కూడా హీరోయిన్ ఉండే అవకాశం ఉంది. అయితే అను ఎమ్మాన్యుయేల్ నే కొనసాగిస్తారనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే, ప్రస్తుతం ఆమెకు క్రేజ్ లేదు. సో.. హీరోయిన్ విషయంలో విశాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరం.

ప్రస్తుతం ఈ హీరో తన దర్శకత్వంలో రాబోతున్న డిటెక్టివ్-2 కోసం రెక్కీ నిర్వహిస్తున్నాడు. లండన్, అజర్ బైజాన్, మాల్టాల్లో పర్యటించి లొకేషన్లు ఫైనలైజ్ చేస్తాడు. ఆ తర్వాత నటీనటులు,టెక్నీషియన్లపై ప్రకటన చేస్తాడు.