కొంతమంది హీరోలపై బాహాటంగానే ప్రేమను చాటుతూ ఉంది నటి తమన్నా. ఈ గ్లామరస్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని ఏ హీరో అనుకుంటున్నాడో కానీ, ముగ్గురు నటుల పేర్లను చెబుతూ.. తనకే గనుక స్వయంవరం పెడితే వారు ముందుండాలని అంటోంది ఈ హీరోయిన్. విశేషం ఏమిటంటే.. ప్రస్తుతం బ్యాచిలర్స్ గా ఉన్న హీరోల మీదే తమన్నా దృష్టి పెట్టినట్టుగా ఉంది.
ప్రభాస్, హృతిక్ రోషన్, విక్కీ కౌశల్.. వీరు తమన్నా హిట్ లిస్టులో ఉన్నారు. తనకే గనుక స్వయంవరం ఏర్పాటు చేస్తే ఆ ముగ్గురూ అందులో పాల్గొని.. తనను ఎవరు గెలుచుకున్నా ఓకే అని అంటోంది తమన్నా. ఈ రోజుల్లో స్వయంవరాలు ఏమటి? అనే లాజిక్ వద్దు. ఇది ఫాంటసీ మాత్రమే.
ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు. ఇక విక్కీ కౌశల్ కూడా ఉత్తరాది అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు. హృతిక్ రోషనేమో అందమైన భార్యకు విడాకులు ఇచ్చి సోలోగా మారాడు. వీళ్ల పెళ్లి గురించి మీడియాలో తరచూ వార్తలు వస్తూ ఉంటాయి. ప్రభాస్ పెళ్లి వార్తల సంగతి వేరే చెప్పనక్కర్లేదు.
అవి ఇంకా ఊహాగానాలుగానే ఉన్నాయి. విక్కీ కౌశల్ మీద బాలీవుడ్ హీరోయిన్ల చూపు ఉందని గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి. హృతిక్ రెండో పెళ్లిచేసుకుంటాడా, తన మొదటి భార్యనే మళ్లీ పెళ్లి చేసుకుంటాడా.. అనే ఊహాగానాలూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో తమన్నా వారిని తన డ్రీమ్ బాయ్స్ గా ప్రకటించేసింది. మరి వీరిలో ఎవరైనా తమన్నాతో పెళ్లికి రెడీనా?