శృంగార తారగా నటిస్తాం కానీ, ఎవరూ ఏమీ అనకూడదంటే ఎలా కుదురుతుంది. గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ….నన్ను అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఆ విధంగా కాసేపు మాత్రమే నటించానని ఓ తమిళ శృంగార తెగ బాధపడిపోతున్నారు. తమిళంలో సోనా అనే నటి శృంగార తారగా పాపులారిటీ తెచ్చుకున్నారు. కారణమేమిటో తెలియదు కానీ, ఇటీవల శృంగార తార అనిపించుకోవడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారామె.
గత ఏడాది ‘జానీ’లో సోనా కనిపించారు. ఆ సినిమా హీరో ప్రశాంత్. ప్రస్తుతం ఆమె మళయాళ ప్రేక్షకులను కవ్వించేందుకు ‘పచ్చమాంగా’ అనే చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. సోనా ఎంతో గ్లామర్‌గా కనిపించారు. దీంతో శృంగార పాత్రలకు పర్యాయ పదమై షకీలాతో సోనాను పోల్చారు. షకీలా బాటలో సోనా ప్రయాణిస్తున్నట్టు విమర్శలు పెద్ద ఎత్తున చెలరేగాయి.
ప్ఛ్….ఏడాది తర్వాత మళయాళంలో ఎన్నో ఆశలతో నటించిన సినిమా పేరు తీసుకురాకపోగా శృంగార తారగా మరింత బలపరిచేలా విమర్శలు రావడం ఆమెను బాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆవేదనతో ఓ ప్రకటన విడుదల చేశారు.
‘బాలుమహేంద్ర సినిమాల తరహాలో ‘పచ్చమాంగా’ ఒక క్లాసికల్ మూవీ. ట్రైలర్‌లో కేవలం కొన్ని సెకన్లు గ్లామరస్‌గా కనిపించా. ఆ పాత్రను చూసి సినిమా అంతా నేను అట్లే నటించినట్లు భావించొద్దు. కేరళలో మహిళల వస్త్రధారణనే నేను ఫాలో అయ్యాను. దయచేసి నన్ను సెక్సీ యాక్టర్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు’ అని సోనా వేడుకున్నారు.
అసలు ఆ కొన్ని సెకన్లనే ట్రైలర్‌లో చూపించడం వెనుక ఉద్దేశం ఏంటో సోనాకు తెలియదా? ఎన్ని సెకన్లు నటించారనేది సమస్య కాదు. అసలు నటించారా లేదా అనేదే ప్రశ్న. చేసిందంతా చేసి…షకీలాతో పోల్చవద్దంటే ఎవరు ఊరుకుంటారు? శృంగార తారగా నటించకపోతే ఈ బాధపడాలు, వివరణ ఇచ్చుకోడాలు ఉండేవి కాదు కదా సోనా?