తమ్మడు ‘ఉప్పెన’ లుక్కొచ్చింది

మెగా క్యాంప్ నుంచి లేటెస్ట్ ఎంట్రీ పంజా వైష్ణవ్ తేజ్. ఎంట్రీ జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా, వైష్ణవ్ తేజ్ సినిమా రంగంలోకి దిగుతున్నారు. సినిమా విశేషాలు వినిపిస్తున్నాయి. షూటింగ్…

మెగా క్యాంప్ నుంచి లేటెస్ట్ ఎంట్రీ పంజా వైష్ణవ్ తేజ్. ఎంట్రీ జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా, వైష్ణవ్ తేజ్ సినిమా రంగంలోకి దిగుతున్నారు. సినిమా విశేషాలు వినిపిస్తున్నాయి. షూటింగ్ జరుగుతోంది. లుక్ మాత్రం రాలేదు. ఇప్పుడు సినిమా దాదాపు పూర్తయిన తరువాత టైటిల్, టైటిల్ లోగో, హీరో లుక్ ను విడుదల చేసారు. 

ఈ సినిమా టైటిల్ ఉప్పెన అంటూ ఎప్పుడో ప్రచారం అయిపోయింది. కాకినాడ తీరంలో జరిగిన ఓ స్టోరీ బేస్డ్ గా ఈ కథను దర్శకుడు బుచ్చిబాబు తయారుచేసుకున్నారు. రఫ్ టచ్ వున్న కథలో హీరో పాత్రలో మెగాహీరో ఎలా వుంటాడో ఇప్పుడు ఫస్ట్ లుక్ ద్వారా చూపించారు. 

సినిమాలో హీరోల బ్యాక్ డ్రాప్ ఏదయినా, గెటప్ మాత్రం పక్కా రిచ్ లుక్ తోనే వుంటుంది. అలాగే ఉప్పెనలో హీరో బ్యాక్ డ్రాప్ గురించి పెర్ ఫెక్ట్ గా తెలియదు కానీ, ఖరీదైన షర్ట్, ఫ్యాంట్ తో కలర్ ఫుల్ గానే వుంది. హీరో పోశ్చర్ కూడా మాన్లీగా బాగుంది. 

ఉప్పెన సినిమా ప్రీ సమ్మర్ రిలీజ్ గా ఏప్రిల్ 2న విడుదల కాబోతోంది. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

సునీల్ టైమింగ్ కి హ్యాట్స్ ఆఫ్