అశ్వద్ధామ..పెర్ ఫెక్ట్ ఫ్యాకేజ్

ఛలో సినిమా విజయం తరువాత నర్తనశాల ఇచ్చిన నీరసాన్ని పక్కన పెట్టి, ఎలాగైనా మాంచి హిట్ తీరాలని హీరో నాగశౌర్య చేస్తున్న సినిమా అశ్వథ్ధామ. Advertisement హీరోయిజం, పాటలు, డ్యూయట్లు ఇలా కమర్షియల్ పాళ్లు…

ఛలో సినిమా విజయం తరువాత నర్తనశాల ఇచ్చిన నీరసాన్ని పక్కన పెట్టి, ఎలాగైనా మాంచి హిట్ తీరాలని హీరో నాగశౌర్య చేస్తున్న సినిమా అశ్వథ్ధామ.

హీరోయిజం, పాటలు, డ్యూయట్లు ఇలా కమర్షియల్ పాళ్లు చూసుకోకుండా ఒక బర్నింగ్ టాపిక్ మీద ఇంటెన్సివ్ థ్రిల్లర్ ను అందించే ప్రయత్నం ఇది.

ఇలాంటి నేపథ్యంలో హీరోయిజం తదితర వ్యవహారాలు అడ్డం పడతాయి. కానీ అవన్నీ దాటుకుని పకడ్బందీ స్క్రిప్ట్ నే తయారుచేసుకున్నట్లుంది నాగశౌర్య.

విడుదలయిన ట్రయిలర్ ను చూస్తుంటే అలాగే వుంది. పక్కాగా ఎక్కడా లూజ్ ఎండ్స్ అనేవి లేకుండా ప్యాక్ చేసినట్లు కనిపిస్తోంది. ఒక్క సీన్ కూడా ట్రయిలర్ స్పీడ్ ను డీవియేట్ చేయలేదు. ఎక్కడా హీరో కోసం అనవసరపు సీన్లు వేయలేదు. ట్రయిలర్ వున్నట్లే సినిమా కూడా వుంటే కచ్చితంగా ఆకట్టుకునేలాగే వుంది. 

జిబ్రాన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ట్రయిలర్ ను బాగా ఎలివేట్ చేసింది. షాట్ డివిజన్ అలాగే బ్లాక్స్ కూడా బాగున్నాయి. ఈ నెల 31న విడుదలయ్యే ఈ సినిమాకు నిర్మాత ఉష మాల్పూరి.

రాజ్ డిస్కో రాజ్