'మీ టూ' అంశానికి తనో బ్రాండ్ అంబాసిడర్ గా ఫీల్ అవుతున్నట్టుగా ఉంది తనూశ్రీ దత్తా. తన కెరీర్ కొనసాగుతున్నంత కాలం ఈమె 'మీ టూ' అనలేదు. అమెరికా వెళ్లిపోయి, కొంతకాలం ఉండొచ్చాకా, హీరోయిన్ గా అవకాశాలకు పూర్తిగా తెరపడ్డాకా తనూశ్రీ పాత కథలు చెప్పుకొచ్చింది.
ఎప్పుడైతేనేం.. ఈమె తన బాధను చెప్పుకుంది, అందుకు కేసులు పెట్టింది. వాటి విచారణలో సాక్షాలు చూపించలేకపోయింది. అదంతా వేరే సంగతి. తను బాధింపబడినట్టుగా ప్రకటించుకున్న తనూశ్రీ విషయంలో జాలి చూపించవచ్చు.
లేటుగానే బయట పెట్టినా ఆమె ఆవేదన ను అర్థం చేసుకోవచ్చు. అయితే 'మీ టూ' ఉద్యమానికి తనో పోస్టర్ గర్ల్ అన్నట్టుగా తనూశ్రీ రియాక్ట్ అవుతోంది.
నేహా కక్కర్ అనే సింగర్ ను ఇండియన్ ఐడల్ పోటీదారుడు ఒకడు గట్టిగా కిస్ చేశాడు. ఆమెను అదిమి పట్టి బుగ్గ మీద పబ్లిక్ గా ముద్దుపెట్టుకున్నాడు. అతడు కాంక్షాపూర్వకంగానే చేసినట్టుగా ఉన్నాడు. అయితే వాడిని అంతటితో వదిలేయాలని నేహా చెప్పుకుంది.
అయిఏత తనూశ్రీ మాత్రం ఆ వ్యవహారంపై రన్నింగ్ కామెంట్రీ మొదలుపెట్టింది. నేహా తనతో పాటు మీ టూ ఉద్యమానికి కలిసి రావాలంటూ తనూశ్రీ పిలుపునిచ్చింది. ఇది కొంచెం ఓవర్ గా లేదా?