Advertisement

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబు కోర్టు గడప తొక్కాల్సి వస్తుందా?

చంద్రబాబు కోర్టు గడప తొక్కాల్సి వస్తుందా?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద ఇప్పటిదాకా చాలా అవినీతి కేసులు నమోదు అయ్యాయి. అయితే ఏ కేసులోనూ ఆయనకు శిక్ష పడలేదు. చివరికి ఓటుకు నోటు కేసులో.. రెడ్ హ్యాండెడ్‌గా రేవంత్ దొరికిపోయినా, చంద్రబాబు ఫోన్ కాల్ రికార్డ్ బయటకు వచ్చినా కూడా... కొనాళ్లు హడావిడి చేసి.. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం మానేసింది.

ఆయన హాయిగానే ఉన్నారు. కానీ.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి మాత్రం.. ఆయనకు ఆ హాయిని దూరం చేసేలా ఉన్నారు. ఆదాయానికి మించి చంద్రబాబు ఆస్తులు కలిగిఉన్నారనే కేసును లక్ష్మీపార్వతి ఇప్పుడు మళ్లీ తిరగతోడుతున్నారు.

నిజానికి ఇది 14 ఏళ్ల కిందటి కేసు. ఒకవేళ అది ఎంతో పెద్ద నేరం అయి, విచారణలో ఆయన దోషి అని తేలి, యావజ్జీవ శిక్ష పడి ఉన్నా కూడా ఈపాటికి పూర్తయిపోయి ఉండేది. అలాంటిది... ఇన్నాళ్ల తర్వాత.. ఆ కేసు విచారణను తిరిగి ప్రారంభించాల్సిందిగా లక్ష్మీపార్వతి కేసు తెరమీదకు వచ్చింది. 14 ఏళ్ల కిందట లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో ఈ కేసు వేశారు. అయితే చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించి.. స్టే తెచ్చుకున్నారు. క్రిమినల్ కేసుల్లో ఆరునెలలకు మించిపోతే స్టే తొలగిపోయినట్లేనని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీద ఏసీబీ కేసును మళ్లీ తిరగతోడినట్లయింది.

చంద్రబాబునాయుడు గతంలోనూ చాలా అవినీతి కేసులు నమోదు అయ్యాయి. ఏ కేసులోనూ శిక్ష పడలేదు. ఈ విషయాన్ని ఆయన చాలా ఘనంగా, తన గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నామీద చాలా కేసులు వేశారు.. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు.. అని అంటుంటారు. కోర్టు గడప తొక్కాల్సిన అవసరం కూడా లేకుండా.. ఆయన వ్యవహారాలు నడిపించారు.

ఇప్పుడు లక్ష్మీపార్వతి వేసిన కేసులో కూడా శిక్ష పడుతుందనే గ్యారంటీ లేదు. ఆస్తులు-ఆదాయం ఒక్కటే నేరం అయితే.. వాటికి లెక్కలు చెప్పడం వారికి పెద్ద పని కాదు. కానీ...గతంలోలాగా ఇప్పుడు ఆయన హవా సాగడం లేదు కాబట్టి.. కోర్టు గడప తొక్కవలసి వస్తుందేమోనని పలువురు అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?