Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఇసుక మాటెత్తలేం.. ఇంగ్లీషును వదలొద్దు!

ఇసుక మాటెత్తలేం.. ఇంగ్లీషును వదలొద్దు!

ప్రతిపక్షాలకు ఇప్పుడు నోట మాట పెగలడం లేదు. రెండు నెలలుగా ఇసుక లభించడం లేదనే అంశాన్ని.. అంతర్జాతీయ అంశంగా అభివర్ణించడానికి, జగన్ చేతగాని తనానికి నిదర్శనంగా పేర్కొనడానికి నానా కష్టాలు పడ్డారు.

వరదలు, రీచ్‌లలో ఇబ్బందులు పట్టించుకోకుండా.. ఇసుక కొరతను ప్రభుత్వానికి ముడిపెట్టే కుట్రలు చేశారు. ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా తీరిపోయింది. అవసరానికి మించి ఇసుక లభ్యమవుతోంది. దీంతో వారికేమీ పాలుపోవడం లేదు. ప్రభుత్వాన్ని తూర్పారపట్టడానికి ఇంగ్లీషు మీడియం తప్ప మరో గతిలేదని వారు భావిస్తున్నారు.

ఇసుక విషయంలో విపక్షాలు అనుచితమైన రాద్ధాంతం చేశాయి. అదే సమయంలో భవన నిర్మాణ రంగానికి సంబంధించి కార్మికులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం వారి శవరాజకీయాలకు ఊతమిచ్చింది. ప్రభుత్వాన్ని ఎడాపెడా విమర్శించారు.

లాంగ్ మార్చ్ చేసిన పవన్ కల్యాణ్.. ఇసుక కొరత తీరిపోయి.. కార్మికులంతా పనులకు వెళుతున్న సమయానికి  భోజన శిబిరాలు నిర్వహించారు. ఆ ముసుగులో ఒక రెండు రోజుల డ్రామా నడిపించారు. అలాంటి డ్రామాలకు కూడా కాలం చెల్లింది.

ఇసుక కొరత, ఒత్తిడి సాంతం తీరిపోయి.. ఇప్పుడు రీచ్ లలో రెడీగా ఉన్న ఇసుకలో కనీసం సగం కూడా బుక్ కాని పరిస్థితి వచ్చింది. దీంతో ఇసుక విక్రయాల్లో బ్యాలెన్స్ వచ్చేసినట్లే. పాపం విపక్షాలకు నోట మాట పడిపోయింది.

అందుకే ఇప్పుడు ఇంగ్లీషు మీడియం అనే ప్రజలు ఆమోదించిన అంశాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నారు. ఇంగ్లిషు మీడియం మీద విమర్శలు గుప్పించడానికే తహతహ లాడుతున్నారు. ఈ సబ్జెక్టు అయితే వచ్చే జూన్ వరకు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండవచ్చునని.. ఏదో ద్రోహం జరిగిపోతున్నట్లుగా అభివర్ణిస్తూ ఉండవచ్చునని వారు  భావిస్తున్నట్లుంది. అందరూ  భాషాప్రియుల అవతారం దాలుస్తున్నారు.

నిర్దిష్టంగా జగన్ ప్రభుత్వంలో ప్రజలకు చేటు చేసే లోపాలను ఎంచడానికి, వాటికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి ప్రతిపక్షాలకు పాయింట్ లేకుండా పోతోంది. పాలన ఇలాగే ఉంటే.. తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వారు ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే అస్తిత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న విపక్షాలు.. ఇప్పుడు అయోమయంలో పడుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?