తప్పు దిద్దుకున్న టాలీవుడ్

టాలీవుడ్ తప్పు దిద్దుకుంది. సీనియర్ హీరో కృష్ణం రాజు మరణిస్తే స్పందించాల్సిన రీతిలో స్పందించని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఎగ్జిబిటర్ల సెక్టార్ తదితర సంస్థలు ఈసారి ముందుగానే స్పందించాయి. కృష్ణం రాజుకు నివాళిగా ఒక్క రోజు…

టాలీవుడ్ తప్పు దిద్దుకుంది. సీనియర్ హీరో కృష్ణం రాజు మరణిస్తే స్పందించాల్సిన రీతిలో స్పందించని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఎగ్జిబిటర్ల సెక్టార్ తదితర సంస్థలు ఈసారి ముందుగానే స్పందించాయి. కృష్ణం రాజుకు నివాళిగా ఒక్క రోజు కూడా షూటింగ్ లు బంద్ చేయలేదు. థియేటర్లు ఒక్క ఆట కూడా ఆపలేదు. దాని మీద అప్పట్లో విమర్శలు వినిపించాయి.

మరి అందుకనో? లేదా మరేం కారణాలు వున్నాయో కానీ సీనియర్ హీరో కృష్ణ మరణించగానే షూటింగ్ ల బంద్ నిర్ణయం వెలువడింది. దీంతో విషయం తెలిసిన వారు టాలీవుడ్ తప్పు దిద్దుకుంది అనుకుంటున్నారు. తెలియని వాళ్లు కృష్ణం రాజు అయితే ఒక విధంగా కృష్ణ అయితే మరో విధంగా వ్యవహరించడం సబబా? అనే క్వశ్చన్లు వేస్తున్నారు.

పవన్ రూటు వేరు

నిన్నటికి నిన్న హరి హర వీరమల్లు షూట్ కోసం భారీ ఏర్పాట్లు చేసారు రామోజీ ఫిలిం సిటీలో. గుర్రాలు..జూనియర్ ఆర్టిస్ట్ లు భారీ సెటప్. కానీ విషయం తెలియగానే పవన్ డైరక్టర్ క్రిష్ కు ఫోన్ చేసి షూటింగ్ క్యాన్సిల్ కొట్టించినట్లు తెలుస్తోంది. దానికి బదులుగా ఈ రోజు షూట్ పెట్టే అవకాశం వుందని బోగట్టా.