తాప్సీ మళ్లీ తెలుగులో

తొలి సినిమాతో అందాలన్నీ ప్రేక్షకుల మందు పరిచేసిన నటి తాప్సీ ఆ తరువాత మాత్రం మాంచి మాంచి పాత్రలనే చేస్తూ వస్తోంది. Advertisement అందుకోసం బాలీవుడ్ ను వేదికగా చేసుకుంది. కానీ మంచి పాత్రలు…

తొలి సినిమాతో అందాలన్నీ ప్రేక్షకుల మందు పరిచేసిన నటి తాప్సీ ఆ తరువాత మాత్రం మాంచి మాంచి పాత్రలనే చేస్తూ వస్తోంది.

అందుకోసం బాలీవుడ్ ను వేదికగా చేసుకుంది. కానీ మంచి పాత్రలు వస్తే తెలుగులో కూడా కనిపిస్తూనే వుంది. లేటెస్ట్ గా ఓ తెలుగుసినిమా కోసం టాలీవుడ్ లో అడుగు పెట్టింది. 

మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించే మిషన్ ఇంపాజిబుల్ సినిమా సెట్ మీదకు తాప్సీ వచ్చింది. గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాను అందించిన స్వరూప్ అందిస్తున్న సినిమా ఇది. గతంలో మహి డైరక్షన్ లో ఆనందోబ్రహ్మ సినిమా చేసిన తరువాత తాప్సీ నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. 

తెలుగులో, హిందీలో ఎక్కడ చేయాలన్నా సరైన సబ్జెక్ట్ అన్నది తన ప్రయారిటీ అని, చాలా గ్యాప్ తరువాత తెలుగులో అలాంటి సబ్జెక్ట్ దొరికిందని అంటోంది తాప్సీ. నిరంజన్ రెడ్డి నిర్మించే ఈ సినిమాను ఓ వైవిధ్యమైన సబ్జెక్ట్ తో రూపొందిస్తున్నారు.