శర్వానంద్ సినిమాకు తరుణ్ భాస్కర్ మాటలు

పెళ్లిచూపులతో పేరుతెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. కానీ తన రెండో సినిమాతో మాత్రం పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఆ తర్వాత నటుడిగా మారాడు. ఫలక్ నుమా దాస్ లాంటి సినిమాల్లో కనిపించాడు. ఇప్పుడు ఈ దర్శకుడు…

పెళ్లిచూపులతో పేరుతెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. కానీ తన రెండో సినిమాతో మాత్రం పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఆ తర్వాత నటుడిగా మారాడు. ఫలక్ నుమా దాస్ లాంటి సినిమాల్లో కనిపించాడు. ఇప్పుడు ఈ దర్శకుడు మాటల రచయిత అవతారం ఎత్తాడు. అవును.. శర్వానంద్ సినిమాకు డైలాగ్ రైటర్ గా పనిచేయబోతున్నాడు తరుణ్ భాస్కర్.

ఈరోజు శర్వానంద్ చెన్నైలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. శ్రీకార్తీక్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్టుకు డైలాగ్స్ ఇవ్వడానికి అంగీకరించాడు తరుణ్ భాస్కర్. అన్నట్టు తరుణ్ భాస్కర్ డైరక్ట్ చేసిన పెళ్లి చూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న రీతూవర్మ, ఈ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించనుంది.

ఇక శర్వానంద్ విషయానికొస్తే.. ఇప్పటికే 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు. 96 రీమేక్ షూటింగ్ చాన్నాళ్ల కిందటే మొదలైంది. 2 వారాల కిందట శ్రీకారం అనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఇప్పుడీ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఇవాళ్టి నుంచే మొదలైంది. అవును.. ఈ సినిమా ఓపెనింగ్, ఫస్ట్ షెడ్యూల్ అన్నీ ఈరోజు నుంచే.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత 96 రీమేక్ ను మళ్లీ సెట్స్ పైకి తీసుకొస్తాడు శర్వా. ఆ తర్వాత శ్రీకారం షెడ్యూల్ మొదలుపెడతాడు. ఇలా 3 సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయబోతున్నాడు. 96 రీమేక్ ఈ ఏడాది చివరి నాటికి, శ్రీకారం సినిమా సంక్రాంతికి, తాజాగా ప్రారంభమైన సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదలకానున్నాయి.

అమరావతిలో భూములు కొన్న నేతల హడల్!