ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ఆదిపురుష్ సినిమా టీఙర్ విడుదలయింది. ఫ్యాన్స్ నుంచి మిక్స్ డ్ టాక్, మిగిలిన వైపు నుంచి కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. సమస్య ఏమిటంటే రాముడు అంటే మన వాళ్లకు పవర్ ఫుల్ వీరుడే కానీ సౌకుమార్యంగా వుండడం అన్నదే అలవాటు.
ఇక్కడ ప్రభాస్ ను బాగా హెవీ మాన్లీ వీరుడిగా చూపించే ప్రయత్నం చేసారు. ఇది ఒక సమస్య. రెండవది సినిమా మొత్తం 90శాతం సిఙి వర్క్ మీద ఆధారపడిపోవడంతో అదేదో యానిమేషన్ ఫిల్మ్ లుక్ ను తెచ్చేసుకుంది.
నిఙానికి దర్శకుడు ఓం రౌత్ ఆలోచన వేరు అని అర్థం అయిపోతోంది. ఎవరైతే తరువాత ఙనరేషన్ పిల్లలు వుంటారో, వారికి నచ్చే ఫార్మాట్ లో సినిమా తీసి అందించాలని అనుకుంటున్నాడు. అందుకే వివిధ ఆకృతులను డిఙైన్ చేసి మరీ చూపించాడు. కానీ ఆ ఙనరేషన్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే ఈ ఙనరేషన్ సంగతి ఏమిటి? రామాయణం అనగానే ఆసక్తిగా వచ్చే సీనియర్ ఙనరేషన్ సంగతేమిటి? అక్కడ మైనస్ మార్కులు పడిపోతాయి.
బట్ కేవలం టీఙర్ చూసి ఓ అంచనాకు వచ్చేయలేము. కానీ చాలా ఆసక్తిగా ఎదురు చూసిన టీఙర్ ఇలా వచ్చేసరికి ఫ్యాన్స్ కొంచెం డిస్సపాయింట్ అయ్యారు. యాంటీ ఫ్యాన్స్ ఫుల్ యాక్టివ్ అయ్యారు.