Advertisement

Advertisement


Home > Movies - Movie News

అన‌సూయ క‌న్నీటిప‌ర్యంతం

అన‌సూయ క‌న్నీటిప‌ర్యంతం

ప్ర‌ముఖ బుల్లితెర యాంక‌ర్ , రంగ‌మ్మ‌త్త‌గా వెండితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అన‌సూయ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అన‌సూయ‌ భావోద్వేగానికి ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు చెప్పిన మాట‌లే కార‌ణం. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అన‌సూయే స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

గోరుచుట్టుపై రోక‌టి పోటు అనే చందంగా అస‌లే క‌రోనాతో అల్లాడుతున్న జ‌నానికి ప్ర‌కృతి వైప‌రీత్యాలు అద‌నంగా తోడ‌య్యాయి. దీంతో ఏ కుటుంబాన్ని క‌దిల్చినా క‌న్నీటి వెత‌లే. ఈ నేప‌థ్యంలో క‌రోనాకు ముందు, తుపానుకు ముందు అని చెప్పు కోవాల్సి వ‌స్తోంది. మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ఉంటున్న వాళ్ల ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయ‌మ‌నే చెప్పాలి.

క‌రోనాతో పాటు హైద‌రాబాద్‌ను ముంచెత్తిన వ‌ర‌ద త‌దిత‌ర ప‌రిస్థితుల‌పై యాంక‌ర్ అన‌సూయ సోష‌ల్ మీడియాలో త‌న అభిప్రా యాల్ని పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న త‌న‌యుడి మాట‌లు త‌న‌కు ఏ విధంగా క‌న్నీళ్లు తెప్పించాయో ట్వీట్ చేశారు. ఇ ట్వీట్ ఏంటంటే... 

‘అమ్మా.. నేను గతానికి వెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు కరోనా లేదు, వరదల్లేవు.. ఆ రోజులే నాకెంతో సంతోషాన్ని అందించాయి’ అని నా తొమ్మిదేళ్ల కుమారుడు చెప్పాడు. ఆ మాటలు నాకెంతో బాధగా అనిపించాయి. కన్నీళ్లు పెట్టుకున్నాను. మనం ఎలాంటి పరిస్థితులు కొని తెచ్చుకున్నాం? రాబోయే తరాల వారికి మనం ఏం అందించనున్నాం?’ అంటూ అనసూయ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

అన‌సూయ‌, భ‌ర‌ద్వాజ్ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు. ఆ ఇద్ద‌రు అయాన్ష్‌, శౌర్య‌. త‌న‌లో సంతోషం లేదా బాధ క‌లిగినా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భావాల‌ను అన‌సూయ పంచుకోవ‌డం గ‌త కొన్నేళ్లుగా సాగుతున్న విష‌యం తెలిసిందే.  

పాపం, ఆర్కేని ఎలా మోసం చేయాలనిపించింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?