Advertisement

Advertisement


Home > Movies - Movie News

బిగ్‌బాస్ షో...స్టార్ట్ ఎప్పుడంటే!

బిగ్‌బాస్ షో...స్టార్ట్ ఎప్పుడంటే!

బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ ఆరో సీజ‌న్ ప్రారంభానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ రియాల్టీ షోపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలున్నాయి. దీన్నిబ‌ట్టి రియాల్టీ ఎంత‌గా వివాదాస్ప‌ద‌మ‌వుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు. సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం దుమారం రేపింది.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి హీరో నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్ -6 ప్రోమో విడుద‌లైంది. ఈ ద‌ఫా సీజ‌న్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల త‌గ్గింద‌ని చెబుతున్నారు. ఈ ద‌ఫా షోలో 12 లేదా 13 మంది కంటెస్టెంట్లు మాత్ర‌మే వుంటార‌నే వార్త‌లొస్తున్నాయి. ఇప్ప‌టికే కంటెస్టెంట్ల ఎంపిక పూర్త‌య్యింది. ఈ మేర‌కు వారికి స‌మాచారం కూడా వెళ్లినట్టు తెలిసింది.

ఈ నెల 25న క్వారంటైన్‌కు రెడీగా వుండాల‌ని కంటెస్టెంట్ల‌కు స‌మాచారం ఇచ్చిన‌ట్టు తెలిసింది. సెప్టెంబ‌ర్ 3 లేదా నాలుగో తేదీల్లో ప్రారంభం కానున్న‌ట్టు తెలిసిందే. దీంతో బుల్లితెర‌పై సంద‌డే సంద‌డి అని చెప్పొచ్చు. 

ఇక షోపై మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, వాటిపై చాన‌ళ్ల‌లో డిబేట్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పేద‌ముంది. మొత్తానికి రియాల్టీ షో హంగామా మొద‌లు కానుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?