సినీ రచయిత యర్రంశెట్టి రమణ పైశాచికత్వానికి నిదర్శనం ఇది. ఏకంగా తన భార్య నగ్న చిత్రాల్నే సోషల్ మీడియాలో పెడతాననే బెదిరింపులకు దిగాడు. దీంతో నిస్సహాయురాలైన బాధితురాలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే…
సినీ రచయిత యర్రంశెట్టి రమణ ఏడాది క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంత కాలానికి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తన భర్త తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు వాపోయింది. ఈ మేరకు భర్తపై ఆమె వేధింపుల కేసు పెట్టింది.
ఈ నేపథ్యంలో పోలీసులు యర్రంశెట్టి రమణకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ దంపతుల మధ్య సంబంధాలు షరా మామూలు అయ్యాయి. తనపై కేసును వాపసు తీసుకోకుంటే నగ్న చిత్రాల్ని యూట్యూబ్‌లో పెడతానంటూ యర్రంశెట్టి రమణ ఫోన్‌లో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని భార్య జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సినీ రచయితపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.