తెలుగు హీరోలపై సెటైర్లు

రైతుల ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతోంది. దేశవ్యాప్త బంద్ జరిగింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు మద్దతుపలికాయి. కానీ టాలీవుడ్ జనాలు, ముఖ్యంగా టాప్ హీరోలు మాత్రం ఈ వ్యవహారానికి దూరంగా వున్నట్లు కనిపిస్తోంది. Advertisement…

రైతుల ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతోంది. దేశవ్యాప్త బంద్ జరిగింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు మద్దతుపలికాయి. కానీ టాలీవుడ్ జనాలు, ముఖ్యంగా టాప్ హీరోలు మాత్రం ఈ వ్యవహారానికి దూరంగా వున్నట్లు కనిపిస్తోంది.

ప్రతి చిన్న దానికి, పెద్ద దానికి ట్వీట్ లు వేయడం, ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లతో కూడా లక్షలు గడించడం అలవాటైన సినిమా సెలబ్రిటీలకు రైతుల సమస్య పట్టినట్లు తెలుస్తోంది.

తమిళనాట మాత్రం హీరో కార్తీ రైతుల సమస్యపై స్పందించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. తెలుగు హీరోలు స్పందించకపోవడాన్ని సోషల్ మీడియా ఎత్తి చూపిస్తోంది.

రైతుల సమస్యలు ఇతివృత్తంగా తీసుకుని మన హీరోలు సినిమాలు తీసి హిట్ చేసి డబ్బులు సంపాదిస్తారని, నిజంగా మాత్రం రైతుల సమస్యల పట్ల స్పందించరని కామెంట్లు కనిపిస్తున్నాయి. 

ఆ మధ్య ఓసారి 'పెద్దల' నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఓ విషయమై ప్రతి ఒక్కరు శహభాష్ అంటూ ట్వీట్ లు వేసారు. కానీ ఈసారి మాత్రం ఎవ్వరూ దీని మీద కలుగచేసుకున్నట్లు లేదు. అందుకే ట్వీట్ల వ్యవహారం ఊపందుకోలేదు అనుకోవాలి.