మొత్తానికి 'కప్పెల' రీమేక్ కు హీరోలు సెట్ అయ్యారు. కరోనా ఫస్ట్ ఫేజ్ లాక్ డౌన్ టైమ్ లో డైరక్ట్ ఓటిటి లో వచ్చిన మలయాళ సినిమాల్లో కప్పెల ఒకటి.
ఈ చిన్న సినిమా కు పెద్ద అప్లాజ్ వచ్చింది. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని హక్కులు కొనుగోలు చేసింది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ.
సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలు వున్నాయి. ఒకటి సెట్ అయితే రెండవది సెట్ కాలేదు. రెండోది సెట్ అయితే మొదటిది తేడా వస్తోంది. ఇలా ఎంతో మందిని ట్రయ్ చేసి, ఆఖరికి సరైన కాంబినేషన్ సెట్ చేసారు.
కార్తి ఖైదీ సినిమాలో నటించి పేరు తెచ్చుకున్న తమిళ నటుడు అర్జున్ దాస్, అలాగే కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న సిద్దు కాంబినేషన్ ఫిక్స్ అయింది. హీరోయిన్ గా ఇద్దరు మలయాళీ అమ్మాయిలను ఫైనల్ లిస్ట్ లోకి చేర్చారు. ఒకరిని ఫైనల్ చేయాల్సి వుంది.
సినిమాకు ఈ బుధవారం శ్రీకారం చుడుతున్నారు. త్వరలో సెట్ మీదకు వెళ్తారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీ నిర్మాత.