నిర్మాతలంతా ఎక్కడ డైరక్టర్ దొరుకుతారా అని గాలం వేసి మరీ చూస్తున్నారు. సరైన డైరక్టర్ చేతిలో వుంటే హీరోలు ఇట్టే డేట్ లు ఇస్తారు. డైరక్టర్ లేకుంటే ఇక అంతే సంగతులు. ఇప్పుడు బ్యానర్ కాదు కీలకం…డైరక్టర్ కావాలి.
అందుకే నిర్మాతలు ఎక్కడ సరైన డైరక్టర్ వుంటే అక్కడ లటుక్కున అడ్వాన్స్ ఇచ్చి దగ్గర పెట్టుకుంటున్నారు. నిర్మాత చిట్టూరి శ్రీను కు ఈ విద్య బాగా వచ్చు. బోయపాటిని పట్టుకుని రామ్ తో సినిమా సెట్ చేసుకున్నారు. వెంకట్ ప్రభును పట్టుకుని నాగ్ చైతన్య సినిమా పట్టేసారు.
లేటెస్ట్ గా మరో డైరక్టర్ ను తెచ్చుకున్నారు. తమిళంలో ఇటీవల చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన లవ్ టుడే డైరక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసేసారు. ప్రదీప్ రంగనాధన్ అనే ఈ డైరక్టర్ మరీ పాత వాడేం కాదు. ఒకటి సినిమాలు మాత్రమే చేసాడు తమిళంలో. చిన్న పాయింట్ తో కొత్త జానర్ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టేసాడు. దాంతో ఇప్పుడు తెలుగులోకి రాబోతున్నాడు. అయిదు కోట్లతో సినిమా తీసి యాభై కోట్ల వసూళ్లు రాబట్టడం అన్నది ఒక ప్లస్..కొత్త పాయింట్ తో సినిమా తీయడం మరో ప్లస్.
అందువల్ల ఇప్పుడు తెలుగు హీరోలు మిడ్ రేంజ్ హీరోలు ఎవరైనా రెడీగా వుంటారు సినిమా చేయడానికి. వెరైటీ కథల కోసం చూసే నాని ఇంకా చాలా మందే వుంటారు కనుక చిట్టూరి శ్రీనుకు మరో సినిమా రెడీ అన్నమాట.