టెన్త్ క్లాస్ డైరీస్..ఆసక్తికరం

డైరీ అంటేనే ఆసక్తికరంగా వుంటుంది. ఎందుకంటే మనవైనా, ఎదుటివారివైనా పర్సనల్ విషయాలు అన్నీ దాగేది అందులోనే కదా. టెన్త్ క్లాస్ డైరీస్ అంటూ ఓ సినిమా వస్తోంది. Advertisement కొత్త విషయం కాకపోయినా, కొత్తగా…

డైరీ అంటేనే ఆసక్తికరంగా వుంటుంది. ఎందుకంటే మనవైనా, ఎదుటివారివైనా పర్సనల్ విషయాలు అన్నీ దాగేది అందులోనే కదా. టెన్త్ క్లాస్ డైరీస్ అంటూ ఓ సినిమా వస్తోంది.

కొత్త విషయం కాకపోయినా, కొత్తగా చెప్పే ప్రయత్నం కన్నా, కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. గరుడ వేగ అంజిగా పేరు పడిన సినిమాటోగ్రాఫర్ అంజి డైరక్టర్ గా మారి చేస్తున్న సినిమా ఇది. శ్రీరామ్..అవిక గౌర్ లీడ్ క్యారెక్టర్లు.

టెన్త్ క్లాస్ లో వీడిపోయిన బంధాన్ని వెదుక్కుంటూ విదేశాల నుంచి హీరో రావడం,  అప్పటికే పెళ్లయిపోయిన అమ్మాయి జీవితంలోని విషాదాలు..మళ్లీ మరోసారి ఆమెను కలిసే ప్రయత్నం విఫలం కావడం, ఇలాంటి నెరేషన్ కనిపించింది ట్రయిలర్ లో. అంజి స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడంతో ఫ్రేమ్ లు చాలా అందంగా కనిపించాయి.  

శ్రీరామ్..అవికగౌర్ లాంటి నటుల నుంచి ఎంత ఎక్స్ పెక్ట్ చేయగలమో అంతే వుంది ట్రయిలర్ లో. సురేష్ బొబ్బిలి పాట ఒకటి క్యాచీ ట్యూన్ తో వినిపించారు. మొత్తానికి జరిగిన సంఘటనల కథ అంటూ కాస్త ఇంట్రస్టింగ్ కానే కట్ చేసారు టెన్త్ క్లాస్ డైరీస్ ట్రయిలర్ ను.