ప్రభాస్-పూజాహెగ్డేను చూస్తే వాయించేయాలనిపించింది

రాధేశ్యామ్ సినిమా కోసం ఆఖరి నిమిషంలో జాయిన్ అయ్యాడు తమన్. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన తమన్, మరోసారి బెస్ట్ ఇచ్చానంటున్నాడు. అఖండ, భీమ్లానాయక్ సినిమాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

రాధేశ్యామ్ సినిమా కోసం ఆఖరి నిమిషంలో జాయిన్ అయ్యాడు తమన్. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన తమన్, మరోసారి బెస్ట్ ఇచ్చానంటున్నాడు. అఖండ, భీమ్లానాయక్ సినిమాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాక్సులు బద్దలుకొట్టిన తమన్, రాధేశ్యామ్ బీజీఎం కూడా అదే రేంజ్ లో ఉంటుందంటున్నాడు. పైగా తెరపై ప్రభాస్-పూజాహెగ్డేను చూసిన తర్వాత తనకు ఆటోమేటిగ్గా మ్యూజిక్ వచ్చేసిందని చెబుతున్నాడు.

“ఇంత పెద్ద లవ్ స్టోరీ ఎప్పుడూ రాలేదు. మ్యూజిక్ డిమాండ్ చేసే కథ ఇది. 30 రోజులుగా పనిచేస్తూనే ఉన్నాం. యూరోప్ లో భారతీయ కచేరీ పెడితే ఎలా ఉంటుందో రాధేశ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలా ఉంటుంది. తెరపై ప్రభాస్-పూజాహెగ్డే ప్రేమను, వాళ్ల కెమిస్ట్రీని చూస్తే మ్యూజిక్ అలా పుట్టుకొచ్చేసింది. వాయించేయాలనిపించింది. వాళ్లిద్దరి కెమిస్ట్రీ నన్ను అంత బాగా ప్రభావితం చేసింది. రాధేశ్యామ్ కు ఒక వయొలిన్ సరిపోదు. వంద వయొలిన్స్ వాడాం. దాదాపు 600 మంది మ్యూజీషియన్లు రాధేశ్యామ్ కు పనిచేశారు. అది ఈ సినిమా రేంజ్.”

రాధేశ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాన్నాళ్ల పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని అంటున్నాడు తమన్. తన మనసుకు బాగా నచ్చి ఈ సినిమా చేశానని, అందుకే అంత బాగా వచ్చిందంటున్నాడు.

“రాధేశ్యామ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మామూలుగా ఉండదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్మూత్ గా మాత్రం ఉండదు. ప్రభాస్ లాంటి కటౌట్ కు స్మూత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎందుకు ఉంటుంది. అంత పెద్ద కటౌట్ ప్రేమలో పడాలంటే ఎన్ని జరగాలి. అలాంటి హై-పాయింట్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి బీజీఎం కూడా మామూలుగా ఉండదు. చాలామందికి రాధేశ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుర్తుండిపోతుంది.”

తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విన్న ఆస్కార్ అవార్డ్ విన్నర్, సౌండ్ ఇంజినీర్ రసూల్ పుకూట్టి.. హిందీ వెర్షన్ కు కూడా అదే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెట్టాలని సూచించాడట. దీంతో అప్పటికే ఉన్న హిందీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను తొలిగించి, తమన్ అందించిన స్కోర్ ను హిందీ వెర్షన్ కు కూడా యాడ్ చేశారట నిర్మాతలు.