Advertisement

Advertisement


Home > Movies - Movie News

హమ్మయ్య 'జరగండి'.. తమన్ కు మరో పరీక్ష

హమ్మయ్య 'జరగండి'.. తమన్ కు మరో పరీక్ష

ఎట్టకేలకు 'గేమ్ ఛేంజర్' సందడి మొదలుకాబోతోంది. ఎప్పుడో మొదలుకావాల్సిన ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ కార్యక్రమం రేపట్నుంచి షురూ కానుంది. కొన్ని నెలల కిందట విడుదల కావాల్సిన జరగండి అనే సాంగ్ ను రేపు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు.

శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ముందుగా 'జరగండి' సాంగ్ ను విడుదల చేయాలనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ పాట సోషల్ మీడియాలో లీక్ అయింది. చాలామంది ఈ పాట వినేశారు. పెదవి విరిచారు కూడా.

దీంతో యూనిట్ నష్టనివారణ చర్యల్లో పడింది. ఓవైపు లీగల్ నోటీసు జారీ చేస్తూనే.. మరోవైపు లీక్ అయిన 'జరగండి' సాంగ్ ఫుల్ గా కంపోజ్ చేసిన వెర్షన్ కాదని.. దానికి మరిన్ని మెరుగులు అద్దాల్సి ఉందని ప్రకటించింది. ఆ మెరుగులు ఏంటో.. లీక్ అయిన సాంగ్ కు, రేపు రిలీజ్ కాబోతున్న సాంగ్ కు మధ్య ఎంత తేడా ఉందో ఇప్పుడు తెలిసిపోతుంది.

తమన్ కు ఈ సినిమా సాంగ్స్ సక్సెస్ అవ్వడం చాలా అవసరం. రీసెంట్ గా వచ్చిన గుంటూరుకారం సినిమాతో ఇతడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. 'కుర్చీ మడతపెట్టి' అనే సాంగ్ మినహాయిస్తే.. మిగతా పాటల విషయంలో హిట్ మ్యూజిక్ ఇవ్వలేకపోయాడనే అపప్రధ ఎదుర్కొన్నాడు.

ఇలాంటి కీలకమైన టైమ్ లో గేమ్ ఛేంజర్ పాటలు రిలీజ్ కాబోతున్నాయి. సినిమాకు హైప్ రావాలన్నా, తమన్ విమర్శల నుంచి తప్పించుకోవాలన్నా.. 'జరగండి' సాంగ్ కచ్చితంగా చార్ట్ బస్టర్ గా నిలవాల్సిన అవసరం ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?