ఎట్టి పరిస్థితుల్లోనూ తానే పాజిటివ్‌గానే ఆలోచిస్తానని మిల్కీ బ్యూటీ తమన్నా అంటున్నారు. ప్రతి ఒక్కరూ అట్లే ఆలోచించాలని ఆమె కోరుతున్నారు. పాజిటివ్‌పై కలవరిస్తూ పలు అంశాలపై తనవైన అభిప్రాయాల్ని ఆమె నిర్మొహమాటంగా వెల్లడించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా పరస్పరం దూషించుకోవడం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
మనుషుల్లో ఇంత తీవ్రంగా ద్వేషించుకునే తత్వం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. పరస్పరం ద్వేషించు కోవడం ఎక్కడి నుంచి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. కరోనా మహమ్మారి నుంచి మానవ సమాజం గుణపాఠాలు నేర్చుకో వాలని సూచించారు. ఈ విపత్కర కాలంలో మనుషులంతా మానసిక కుంగుబాటుకు గురై ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఈ కరోనా కష్టకాలంలో మానసిక ధైర్యాన్ని ఇచ్చే ఓదార్పు, సాంత్వన మాటలు కావాలన్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా సోషల్ మీడియాలో ప్రతికూల అంశాల్ని పెంచే ప్రచారమే ఎక్కువగా జరుగుతోందన్నారు. ఇప్పుడు సమాజం ఓ జంక్షన్‌లో నిలిచిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యావంతులు, పలుకుబడి ఉన్న వాళ్లు చొరవతో ముందుకొచ్చి ప్రజల్లో జీవితంపై ఆశావహ దృక్పథాన్ని పెంచే ప్రయత్నం చేయాలని కోరారు.
పాజిటివ్ ఆలోచనలను పెంచే వేదికగా సోషల్‌మీడియాను వినియోగించాలన్నారు. కనీసం కరోనా సంక్షోభం సమసిపోయే వరకైనా స్నేహభావంతో ఉండాలని మిల్కీ బ్యూటీ తమన్నా విజ్ఞప్తి చేశారు. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా పాజిటివ్‌గా ఆలోచిస్తానని చెప్పుకొచ్చారామె. అందరూ తమన్నాలా ఆలోచిస్తే ఇక సమస్య ఏముంది?