Advertisement

Advertisement


Home > Movies - Movie News

థాంక్యూ కోసం దిల్ యత్నాలు

థాంక్యూ కోసం దిల్ యత్నాలు

చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన సినిమా థాంక్యూ. ఈ నెల 22న విడుదల. ఇప్పటికే ఈ సినిమా డేట్ ఒకసారి మార్చారు. కానీ పోటీ తప్పలేదు. 22న నిఖిల్ కార్తికేయ 2 విడుదల ప్లానింగ్ లో వుంది. దాని ట్రయిలర్ కు మంచి బజ్ వచ్చింది. మంచి రేటుకు సింగిల్అ పాయిట్ లో అమ్ముడు పోయింది. 

మరోపక్కన థాంక్యూ సినిమా పరిస్థితి రివర్స్ లో వుంది. సినిమా కు 45 కోట్లు ఖర్చయిపోయింది. నాన్ థియేటర్ మీద 24 కోట్ల వరకు రికవరీ వచ్చింది. మరో ఇరవై కోట్లు థియేటర్ మీద రావాలంటే మామూలు విషయం కాదు. పైగా అమ్మకుండా డిస్ట్రిబ్యూషన్ కే ఇస్తున్నారు.

అందుకే సోలో గా విడుదల చేయించాలని దిల్ రాజు ప్రయత్నాలు ప్రారంభించారు. కనీసం అలా అయితే కాస్త ఆశలు పెట్టుకోవచ్చనకుంటున్నారు. కార్తికేయ 2 రెండు వారాలు వెనక్కు పంపేలా దిల్ రాజు పావులు కదుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 5 కు కార్తికేయ 2 వెళ్తుందని ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి.

బహుశా బిజినెస్ రీత్యా కార్తికేయ 2 నిర్మాతలు పైకి ఏమీ చెప్పడం లేదు. కానీ దిల్ రాజు వర్గాలు మాత్రం కార్తికేయ 2 వెనక్కు వెళ్లిపోయిందనే అంటున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?