ఆమెతో ప్ర‌ణ‌యం ముగిసిన అధ్యాయంః ప్ర‌ముఖ న‌టుడు

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి కిమ్ శ‌ర్మ‌తో త‌న బంధం ముగిసిన అధ్యాయం అని న‌టుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే చెప్పుకొచ్చాడు. 2016లో స‌న‌మ్ తేరీ క‌స‌మ్ ద్వారా బాలీవుడ్‌లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌స్తుతం తైష్…

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి కిమ్ శ‌ర్మ‌తో త‌న బంధం ముగిసిన అధ్యాయం అని న‌టుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే చెప్పుకొచ్చాడు. 2016లో స‌న‌మ్ తేరీ క‌స‌మ్ ద్వారా బాలీవుడ్‌లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌స్తుతం తైష్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. తకిట తకిట సినిమాతో  టాలీవుడ్‌కు హర్షవర్ధన్ ప‌రిచ‌య‌మ‌య్యాడు.

ఇక కిమ్ శ‌ర్మ విష‌యానికి వ‌స్తే … ‘మొహబ్బతే’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారామె.  ఫిదా, తుమ్‌సే అచ్చా కౌన్‌ హై, కహెతా హై దిల్‌ బార్‌ బార్‌ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో ఖడ్గం సినిమాలో నటించారు.

అలాగే సూప‌ర్ హిట్ సాధించిన ‘మగధీర’లో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో డ్యాన్స్ చేసి టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. 2010లో వ్యాపారవేత్త అలీ పుంజానీని పెళ్లాడారు. అనంత‌రం వాళ్ల మ‌ధ్య విభేదాలు రావ‌డంతో  భర్తకు దూరంగా ఉంటున్నారు.

మ‌రోవైపు కిమ్ శ‌ర్మ, తాను ప్రేమ‌లో ఉన్న‌ట్టు గ‌తంలో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆ చ‌ర్చ సాగుతుండ‌గానే …వాళ్లిద్ద‌రూ విడిపోయిన‌ట్టు తాజాగా బాలీవుడ్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే సంద‌ర్భంగా హ‌ర్ష సోష‌ల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వైర‌ల్ అయింది. వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఎడ‌బాటును నిర్ధారించేలా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

‘నీతో గడిపిన సమయం అత్యద్భుతం. ఆ దేవుడు నిన్నూ, నన్నూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. బై’ అంటూ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఓ క్లారిటీ ఇచ్చే ఉద్దేశంతో పోస్టు పెట్టాడు. ఈ నేప‌థ్యంలో సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌న వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త జీవితానికి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు.

త‌న‌ డీఎన్‌ఏలోనే ఏదో తప్పు జరిగింద‌న్నాడు. 12 ఏళ్లపాటు తాను ఒంటరిగానే ఉన్న‌ట్టు చెప్పుకొచ్చాడు.  ఏ కారణం లేకుండా ఎవరూ విడిపోరని చెప్ప‌డం ద్వారా తాము వేరు ప‌డ‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు.  ఇందులో దాచడా నికి ఏమీ లేద‌న్నాడు. కిమ్ శ‌ర్మ, తాను  కొన్నాళ్లపాటు కలిసే ఉన్నామ‌న్నాడు.

కానీ ఇప్పుడు ఆ బంధం ముగిసి పోయిన అధ్యాయ‌మ‌ని చెప్పుకొచ్చాడు.  ఆమెతో గడిపిన సమయం జీవితంలోనే అత్యంత మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని అత‌ను చెప్పుకొచ్చాడు. అంతేకాదు, కిమ్‌శ‌ర్మ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.  ఈ భూమి మీద ఉన్న హాస్యచతురత గల మనుషుల్లో కిమ్‌ ముందు వరుసలో ఉంటుందని స‌ర్టిఫికెట్ ఇచ్చాడు.

జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయం