మంత్రి అనిల్ ఒక్క‌సారి చెబితే …వంద‌సార్లు చెప్పిన‌ట్టే!

ఏ విష‌యాన్నైనా ఏపీ జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ ఎంతో క్లారిటీతో చెబుతారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై కూడా ఆయ‌న తాజాగా మ‌రోసారి స్ప‌ష్ట‌త ఇచ్చారు. Advertisement మంత్రి అనిల్ ఒక్క‌సారి చెబితే వంద‌సార్లు…

ఏ విష‌యాన్నైనా ఏపీ జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ ఎంతో క్లారిటీతో చెబుతారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై కూడా ఆయ‌న తాజాగా మ‌రోసారి స్ప‌ష్ట‌త ఇచ్చారు.

మంత్రి అనిల్ ఒక్క‌సారి చెబితే వంద‌సార్లు చెప్పిన‌ట్టే అనే కిక్కు ఇచ్చేలా త‌న అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొడుతారంటారు. తాజాగా ప‌లు అంశాల‌పై త‌న అభిప్రాయాల‌ను మీడియాతో పంచుకున్నారు.  

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ఆశ‌ల‌పై నీళ్లు పోసేలా అనిల్ అభిప్రాయం ఉంది. ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం అసాధ్య‌మ‌ని మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు.

నెల్లూరులో  ‘నాడు-నేడు’ పనులను శుక్ర‌వారం ఆయ‌న  పరిశీలించారు. అనంత‌రం మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు ఇక్క‌డ జ‌ర‌గ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. 

ఎన్నికల కమిషన్, ప్రభుత్వం కలిసి సమన్వయంతో ముందుకెళ్లాల్సి ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఏకపక్ష నిర్ణయాలు కుదరవని నిమ్మ‌గ‌డ్డ‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు.చంద్రబాబు ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం కాదని, వాస్తవాలు తెలుసుకోవాలని అనిల్‌ హితవు పలికారు. 

దేశ చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేని విధంగా  స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.  జూమ్‌ మీటింగ్‌లో ఆరోపణలు చేయడం మానేసి,  ఒకసారి స్కూళ్ల అభివృద్ధిని చూడాల‌ని చంద్ర‌బాబును కోరారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తుందో తెలుసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. 

జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయం