జీవితానుభవంతో వాస్తవాలు చెప్పే పెద్దలను చూస్తుంటాం. ఇప్పుడా కోవలో స్టార్ హీరోయిన్ సమంత చేరినట్టున్నారు. కాకపోతే ఈమె వయసు చిన్నదైనా, జీవితానుభవాలు చాలానే వున్నాయి. సమంత జీవితంలో అనేక కోణాలున్నాయి.
సినిమా, టాలీవుడ్ సినీ సెలబ్రిటీ కుటుంబానికి చెందిన నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా అన్నీ కలలా జరిగిపోయాయి. జీవితమంటే అదే. అనుకున్నవన్నీ జరగవు. అనుకోనివి జరగకుండా ఆగవు.
తాజాగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో తనవైన అభిప్రాయాల్ని సమంత కుండబద్ధలు కొట్టినట్టు చెబుతుంటారు. ఈ దఫా అబద్ధాలకు సమాజం ఇచ్చే ప్రాధాన్యం గురించి ఆమె చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
“నిజాలు అరుదుగా బయటకు వస్తాయి. కానీ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారంలో ఉంటాయి. అంతేకాదు అబద్ధాలనే ఈ సమాజం ఎక్కువగా నమ్ముతుంది” అంటూ సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్ట్ చేయడానికి నేపథ్యం ఏదైనా… జీవితంలో అబద్ధాల ప్రచారంతో దెబ్బతిన్న బాధితురాలిగా నెటిజన్లు సమంతను గుర్తిస్తున్నారు.
సమంత తాజా పోస్ట్‌పై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సమంత పోస్టుపై చర్చ మాత్రం బాగా జరుగుతోంది.