థియేటర్లు ఓకె..కానీ రేట్లు

ఆంధ్రలో థియేటర్లు తెరచుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కీలకమైన ఈస్ట్ గోదావరిలో మాత్రం ఇంకా కొద్ది పాటి ఆంక్షలు కొనసాగుతున్నాయి.  Advertisement అలాగే టికెట్ రేట్ల సమస్య కూడా అలాగే…

ఆంధ్రలో థియేటర్లు తెరచుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కీలకమైన ఈస్ట్ గోదావరిలో మాత్రం ఇంకా కొద్ది పాటి ఆంక్షలు కొనసాగుతున్నాయి. 

అలాగే టికెట్ రేట్ల సమస్య కూడా అలాగే వుండిపోయింది. అందువల్ల ఇప్పటికిప్పుడు సినిమాలు విడుదలవుతాయి అని అనుకోవడానికి లేదు. 

ఈనెల 8 నుంచి థియేటర్లు యాభై శాతం ఆక్యుపెన్సీతో తెరచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. బహుశా 15 నుంచి ఈస్ట్ గోదావరిలో కూడా అదే అమలు అవుతుంది. అందువల్ల 15 నుంచి సినిమాల విడుదలలకు మార్గం సుగమం అయినట్లే.

అయితే టికెట్ రేట్ల సమస్య అలాగే వుంది.అది తేలే వరకు మిడ్ నుంచి భారీ సినిమాల విడుదల కష్టం. ఈ మేరకు ఎగ్జిబిటర్లు త్వరలో విజయవాడలో సమావేశమై బి సెంటర్లలో కూడా 100 రూపాయల టికెట్ రేట్లు అమలు చేయాలని, సి సెంటర్ల రేట్లు సవరించాలని కోరే అవకాశం వుంది. ఈ మేరకు సిఎమ్ జగన్ దగ్గరకు ఓ డెలిగేషన్ వెళ్లే అవకాశం వుంది. 

టికెట్ రేట్ల సమస్య సానుకూలంగా పరిష్కారం అయితేనే మిడ్ రేంజ్, భారీ సినిమాలు థియేటర్ మొహం చూస్తాయి. లేదూ అంటే ఓటిటి దారి పట్టాల్సిందే.