రహస్య గూఢచారిగా నందమూరి హీరో

నందమూరి కల్యాణ్ రామ్ నుంచి కూడా పాన్ ఇండియా మూవీ వచ్చేస్తోంది. ఈరోజు తన పాన్ ఇండియా మూవీని ప్రకటించాడు కల్యాణ్ రామ్. దాని పేరు డెవిల్. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.…

నందమూరి కల్యాణ్ రామ్ నుంచి కూడా పాన్ ఇండియా మూవీ వచ్చేస్తోంది. ఈరోజు తన పాన్ ఇండియా మూవీని ప్రకటించాడు కల్యాణ్ రామ్. దాని పేరు డెవిల్. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

డెవిల్ సినిమాలో రహస్య గూఢచారిగా కనిపించబోతున్నాడు కల్యాణ్ రామ్. అది కూడా ఈ కాలానికి చెందిన పాత్ర కాదు. స్వతంత్రానికి పూర్వం, బ్రిటిష్ పాలనలో సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. పైన కోటు, కింద పంచె కట్టు, చేతిలో తుపాకీతో కల్యాణ్ రామ్ కాస్త కొత్తగానే కనిపిస్తున్నాడు.

ఇంతకీ ఈ ప్రాజెక్టుకు డెవిల్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా..? సినిమాలో హీరో పాత్ర పేరు అదే. ఓ రహస్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగిన డెవిల్, ఆ క్రమంలో మరిన్ని రహస్యాల్ని కనుగొంటాడు. ఈ ప్రయాణంలో ప్రేమ-మోసం, ద్రోహం అనే వలయాల్లో చిక్కుకుంటాడట.

సో.. కథకైతే పాన్ ఇండియా అప్పీల్ ఉన్నట్టే ఉంది. లవ్, యాక్షన్, రొమాన్స్, సస్పెన్స్.. ఇలా అన్ని మిక్స్ చేసి డెవిల్ కథ రాసుకున్నారనే విషయం అర్థమౌతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తారట. అభిషేక్ నామా ఈ సినిమాకు ప్రొడ్యూసర్. నవీన్ మేడారం దర్శకుడు.