సాయి ధరమ్ తేజ్-దేవా కట్టా కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా రిపబ్లిక్. ఈ సినిమా ఫస్ట్ కాపీ దాదాపు రెడీ అయిపోతోంది.
కరోనా ఫస్ట్ ఫేజ్ తరువాత విడుదలయిన తొలి సినిమా సాయి తేజ్ దే. ఈ సారి కూడా అలాగే ఈ సినిమా రెడీ అవుతోంది. కానీ ముందుగా విడుదల అవుతుందా? కాదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు.
సెప్టెంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి నుంచి సినిమా ప్రచారానికి తెరతీయాలనే ఆలోచనతో ఫస్ట్ సాంగ్ ను విడదుల చేయబోతున్నారు.
ఆ సాంగ్ విడుదలకు సంబంధించిన చిన్న ప్రోమోను ఈ రోజు వదిలారు. దర్శకుడు దేవా..గీత రచయిత రెహమాన్..సంగీత దర్శకుడు మణిశర్మ కలిసి పాటను తయారుచేస్తున్న వైనమే ఈ వీడియో.
ఈనెల 11న సాంగ్ ను విడుదల చేస్తారు. అంతవరకు ఈ ప్రోమో కట్ ను చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాల్సిందే.