ప్రభుత్వం మళ్లీ అధికారిక లాక్‌డౌన్ ప్రకటించదనేది తేలిపోయినా కానీ సినిమా థియేటర్లు మాత్రం ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేదు.
స్కూల్స్, సినిమా థియేటర్స్ రన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చే రిస్క్ గవర్నమెంట్ ఇప్పట్లో తీసుకోలేదు. దీంతో సినిమా థియేటర్లు దసరా నాటికి తెరుచుకోవచ్చునని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అక్టోబర్‌లో థియేటర్లు తెరుచుకోవచ్చునని పర్మిషన్స్ ఇస్తే… విడుదలకు సిద్ధంగా వున్న సినిమాలను దసరాకి లైనప్ చేయాలని చూస్తున్నారు.
ఒకవేళ అప్పటికీ థియేటర్లు తెరుచుకోని పక్షంలో ఇక సంక్రాంతికే సినిమా సందడి మొదలయ్యేదని కూడా అంటున్నారు.
ఈ సంక్రాంతికి వచ్చిన భారీ సినిమాలు ఘన విజయాలు అందుకుని ఇచ్చిన ఉత్సాహాన్ని కరోనా నీరుగార్చేసింది. ఈ ఏడాది తెలుగు సినిమాకి అత్యంత వైభవోపేతంగా వుంటుందనే ఆశలు అడుగంటిపోయాయి.
చరిత్ర చూడనంత దారుణమైన స్లంప్ తెలుగు సినిమా ప్రస్తుతం ఎదుర్కొంటోంది. ఈ నష్టం భర్తీ అయి మళ్లీ నార్మల్ అవ్వాలంటే కనీసం రెండేళ్లు పడుతుందని ట్రేడ్ టాక్.