యష్‌రాజ్ సంస్థలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేస్తోన్న భూమి పేడ్నేకర్‌కి అనుకోకుండా హీరోయిన్ అయ్యే అవకాశం దక్కింది. 'దమ్ లగాకే హైషా' చిత్రం కోసం ఆమె ఓవర్ వెయిట్‌తో కనిపించాల్సిన అవసరం పడింది. అందుకోసం బరువు పెరిగిన భూమి తొలి చిత్రంతోనే తన సత్తా చాటుకుంది. సగటు బాలీవుడ్‌్ హీరోయిన్‌కి భిన్నంగా అనిపించే భూమి తన గ్లామర్‌తో కంటే టాలెంట్‌తోనే సక్సెస్ అయింది.
డీ గ్లామరైజ్డ్ పాత్రలు చేస్తూ సగటు భారతీయ యువతులు తమని తాము ఐడెంటిఫై చేసుకునేలా భూమి హీరోయిన్‌కి కొత్త నిర్వచనం ఇచ్చింది. దానికి తోడు కథల ఎంపికలో కూడా భూమి చాలా ప్రత్యేకత చూపిస్తుంది.
ఆమె ఎంచుకునే కథల్లోని బలం వల్లే అన్ని విజయాలని ఆమె అందుకోగలుగుతోంది. కేవలం డీ గ్లామ్ క్యారెక్టర్లే కాకుండా అవసరమైతే బోల్డ్‌గానూ నటించగలనని లస్ట్ స్టోరీస్‌లో చూపించింది.
తన యజమానితో అక్రమ సంబంధం పెట్టుకునే పని మనిషి పాత్రలో భూమి పేడ్నేకర్ ఆ చిత్రంలో ఒక ఘాటైన శృంగార సన్నివేశంలో నటించింది.
వరుస విజయాలతో భూమి పేడ్నేకర్ ఇప్పుడు బాలీవుడ్ లో బడ్జెట్ చిత్రాలకి పెద్ద దిక్కుగా మారిపోయింది.