cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇది క‌థ‌కాదు..నా లైఫ్‌స్టోరీః క‌మిట్‌మెంట్ న‌టి

ఇది క‌థ‌కాదు..నా లైఫ్‌స్టోరీః క‌మిట్‌మెంట్ న‌టి

అన్వేషి జైన్‌, తేజ‌స్వి మ‌దివాడ‌, త‌నిష్క్ రాజ‌న్‌, అమిత్ తివారి ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమా ‘కమిట్‌మెంట్‌’. చిత్ర ద‌ర్శ‌కుడు ల‌క్ష్మీకాంత్ చెన్నా. ఈ చిత్రం టీజ‌ర్ బుధ‌వారం విడుద‌లైంది. 

క‌మిట్‌మెంట్ అనే టైటిల్‌ యూత్‌ను ఆక‌ట్టుకుంటుం దన‌డంలో సందేహం లేదు.  సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న తేజ‌స్వి మ‌దివాడ టీజ‌ర్ విడుద‌లైన సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు.

తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తాను ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్న‌ట్టు తెలిపారు.  తెలుగు అమ్మాయిలను కమిట్‌మెంట్‌ అడగటం ఈజీ అనే అభిప్రాయం ఇండ‌స్ట్రీలో ఉంద‌న్నారు. అంతేకాదు, త‌న‌ను  డైరెక్ట్‌గా కమిట్‌మెంట్‌ అడిగార‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

గతంలో పెద్ద దర్శకులతో తాను చేశాన‌ని,  చాలా చోట్ల అసౌకర్యంగా ఫీలయ్యానన్నారు. త‌న జీవితంలో ఎదురైన  అనుభవాల్ని ప్రేక్షకులితో పంచుకునే అవ‌కాశం ఈ సినిమాతో వ‌చ్చింద‌న్నారు. 

ఇది కథ కాదని, త‌న లైఫ్‌ స్టోరీ అని ఆమె చెప్పారు. ఇండ‌స్ట్రీలో అవాంఛ‌నీయ ధోర‌ణుల వ‌ల్ల విసిగిపోయి... ఒక ద‌శ‌లో నటన మీద ఆసక్తి పోయి, ఇక మీద‌ట‌ నటించకూడదని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న రోజుల్ని ఆమె గుర్తు చేసుకున్నారు.  

నిమ్మ‌గ‌డ్డ అఖ‌రి ఆశ...ఇక గ‌వ‌ర్న‌ర్ పైనే భారం

 


×