cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెళ్లి హామీతో అవినాష్‌ ఖుషీ

పెళ్లి హామీతో అవినాష్‌ ఖుషీ

బిగ్‌బాస్ ఫేం, క‌మెడియ‌న్ అవినాష్‌తో పెళ్లి సంతోషం క‌నిపించింది. బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-4 న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌లో 74వ రోజు ఇంటి స‌భ్యుల కుటుంబ స‌భ్యుల‌ను హౌస్‌లోకి పంపి సంతోష ప‌రిచారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ వెళ్లిన వాళ్ల‌లో అంద‌రూ త‌ల్లులే ఉండ‌డం విశేషం.

అఖిల్‌, హారిక‌, అభిజిత్‌, అవినాష్ త‌ల్లులను హౌస్‌లోకి పంపారు. ఈ సంద‌ర్భంలో త‌ల్లుల‌తో పాటు కంటెస్టెంట్ల భావోద్వేగంతో హౌస్ త‌డిసి ముద్ద‌యింది. మొద‌ట‌గా అఖిల్ త‌ల్లి వెళ్లారు. 

టాస్క్‌లో భాగంగా స్టాచ్యూ భంగిమ‌లో ఉన్న అఖిల్ త‌న త‌ల్లిని చూడ‌గానే తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. ఆ త‌ర్వాత కొంత సేప‌టికీ బిగ్‌బాస్ రిలీజ్ అన‌డంతో ప‌రుగునా త‌ల్లి చెంత‌కు వెళ్లి వెక్కివెక్కి ఏడ్చాడు. అయితే ఏడ్వ‌కూడ‌ద‌ని త‌ల్లి మురిపెంగా వారించ‌డంతో, అఖిల్ అదుపు చేసుకున్నాడు.

ఇదిలా ఉండ‌గా చివ‌రిగా అవినాష్ అమ్మ మ‌ల్ల‌వ్వ హౌస్‌లోకి అడుగు పెట్టారు. కొడుకును చూడ‌గానే అమ్మ‌, ఆమెను చూడ‌గానే కొడుకు ఆనందంలో త‌బ్బిబ్బ‌య్యారు. త‌న‌ను సెల్ఫీలు అడుగుతున్నారంటూ మ‌ల్లవ్వ కొడుకుతో గొప్ప‌గా, కాసింత గ‌ర్వ‌గా చెప్పుకొచ్చారు.

ఇదే స‌మ‌యంలో మిగిలిన స‌భ్యుల‌తో మ‌ల్ల‌వ్వ స‌ర‌దాగా మాట్టాడారు. స్టెప్పులేసి య‌వ ర‌క్తం తొణికిస‌లాడుతున్న ఇంటి స‌భ్యుల‌ను ఉత్తేజ ప‌రిచారు. అవినాష్ గురించి త‌ల్లికి ఇంటి స‌భ్యుడు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. ఊరికే పెళ్లి పెళ్లి అంటున్నాడ‌ని త‌ల్లి వ‌ద్ద ఆట ప‌ట్టించారు.

అవినాష్ అమ్మ మ‌ల్ల‌వ్వ కూడా అదే స‌ర‌దాగా స్పందిస్తూ ....హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత పెళ్లి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. దీంతో అవినాష్ ఖుషీ అయ్యాడు. ఆ ఆనందంలో గాలిలో విహ‌రించిన ఫీలింగ్ అత‌నిలో క‌లిగింది. మిగిలిన ఇంటి స‌భ్యుల కుటుంబ స‌భ్యులు ఈ రోజు వ‌చ్చే అవ‌కాశం ఉంది. 

నిమ్మ‌గ‌డ్డ అఖ‌రి ఆశ...ఇక గ‌వ‌ర్న‌ర్ పైనే భారం

 


×