సోనూసూద్ సహాయం వెనక రీజన్ ఇదే

లాక్ డౌన్ టైమ్ లో హీరో అయిపోయాడు సోనూ సూద్. బహుశా సెలబ్రిటీ హోదాలో, క్షేత్రస్థాయిలో అతడు చేసినంత సహాయం ఇంకెవరూ చేయలేదేమో. Advertisement ఒక్కసారిగా సోనూకు ఇంత పెద్ద మనసు ఎలా వచ్చింది? …

లాక్ డౌన్ టైమ్ లో హీరో అయిపోయాడు సోనూ సూద్. బహుశా సెలబ్రిటీ హోదాలో, క్షేత్రస్థాయిలో అతడు చేసినంత సహాయం ఇంకెవరూ చేయలేదేమో.

ఒక్కసారిగా సోనూకు ఇంత పెద్ద మనసు ఎలా వచ్చింది?  మరీ ముఖ్యంగా బస్సులు, రైళ్లు పెట్టి మరీ వలస కూలీల్ని వాళ్ల స్వస్థలాలకు పంపించాలనే ఆలోచన ఎలా వచ్చింది? తనకు ఆ ఆలోచన రావడం వెనక కారణాన్ని సోనూ బయటపెట్టాడు.

“లాక్ డౌన్ టైమ్ లో ప్రజలంతా నడుచుకుంటూ వేల కిలోమీటర్లు వెళ్తున్నారు. నాకు సహాయం చేయాలని మనసులో ఉంది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. హైవేపై నడిచివెళ్తున్న వాళ్లకు పండ్లు ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఓరోజు ఓ గుంపు నా దగ్గరకొచ్చింది. 

తమకు 10 రోజులకు సరిపడ పండ్లు కావాలని వాళ్లు నన్ను అడిగారు. ఎందుకంటే, తామంతా కర్నాటకకు నడిచి వెళ్తున్నామని, ఆహారం కావాలని అభ్యర్థించారు. అప్పుడే నాకు ఐడియా వచ్చింది. వాళ్లకు 10 రోజులకు సరిపడ ఆహారం ఇచ్చే కంటే.. నేరుగా వాళ్ల గమ్యస్థానానికి చేరిస్తే మరింత ఆనందిస్తారని అనిపించింది. ఇక అప్పట్నుంచి నా సహాయం ఆ దిశగానే సాగింది.”

వలస కార్మికుల్ని వాళ్ల స్వస్థలాలకు చేర్చాలనే ఆలోచన వెనక ప్రేరణను సోనూ సూద్ బయటపెట్టాడు. మరోవైపు సినిమాల్ని, తన సేవా కార్యక్రమాల్ని మిక్స్ చేసి చూడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ నటుడు కమ్ రియల్ లైఫ్ హీరో.

ఎప్పట్లానే విలన్ పాత్రలు చేస్తానని, మంచి కథలు వస్తే క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తానని.. అంతే తప్ప తన సేవా కార్యక్రమాలు చూసి సినిమాలపై అంచనాలు పెట్టుకోవద్దని కోరుతున్నాడు సోనూ.

కంగ‌నాపై ముంబైలో ఒక కేసు