తల్లి లాంటి తెలుగు చిత్రపరిశ్రమపై నోరు పారేసుకున్న ముద్దుగుమ్మకు నెటిజన్లు కామెంట్స్‌తో బడితపూజ చేస్తున్నారు. తనను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టి, ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తీసుకొచ్చిన దక్షిణాది చిత్రపరిశ్రమపై ప్రముఖ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ … సౌత్ ఇండియన్ సినిమా వాళ్లు నడుము మత్తులోనే ఉంటారని, మిడ్ డ్రెస్‌లలో తమను చూడాలనుకుంటారని చెప్పుకొచ్చారు.
పూజా నవ్వుతూ ఈ మాటలు చెప్పినప్పటికీ విషయం చాలా సీరియస్ అయింది. సోషల్ మీడియాలో పూజా కామెంట్స్ హీట్ పెంచాయి. అసలు చిత్రపరిశ్రమలో తనకు లైఫ్ ఇచ్చిందే సౌత్ ఇండియా అనే విషయాన్ని ఆమె మరిచినట్టున్నారు.
2012 లో తమిళంలో ముగమూడి అనే సినిమాతో ఆమె కెరీర్ ప్రారంభమైంది. 2014 లో ముకుంద సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించారామె.
బాలీవుడ్‌లో ప్రవేశించేందుకు 2016 వరకు ఆమె వేచి చూడాల్సి వచ్చింది. రంగస్థలం లాంటి హిట్ సినిమాలో ఓ పాటలో ప్రత్యేక పాత్ర పోషించారామె. ఇంకా అనేక హిట్ సినిమాల్లో నటించే అవకాశం టాలీవుడ్ ఇచ్చింది. అలాంటిది సౌత్ ఇండియా ఇండస్ట్రీని తూలనాడడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
సౌత్ ఇండియా వల్లే హీరోయిన్‌గా గుర్తింపుతో పాటు డబ్బు సంపాదించి, సంపాదిస్తూ …ఇప్పుడు తిన్నింటి వాసాలను లెక్కపెడుతోందని కామెంట్స్ పెడుతున్నారు. దక్షిణాది చిత్రపరిశ్రమను కించపరిచే బదులు గ్లామర్ పాత్రలు చేయకుండా ఉండాల్సిందని హితవు పలుకుతున్నారు. బాలీవుడ్‌లో మాత్రం అన్నీ సంప్రదాయబద్ధమైన పాత్రలే చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
నిన్ను స్టార్ హీరోయిన్ చేసినందుకు తగిన గుణపాఠం చెప్పావని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్'తో పాటు అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో పూజా నటిస్తుండడాన్ని గుర్తు చేస్తూ ….గౌరవం లేనప్పుడు ఎందుకు నటిస్తున్నారని నిలదీస్తుండడం గమనార్హం. మరి తనపై ట్రోల్స్‌కు పూజా ఏం సమాధానం చెబుతారో?