Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ వారం ట్రేడ్ టాక్: థియేట్రికల్ రిలీజ్

ఈ వారం ట్రేడ్ టాక్: థియేట్రికల్ రిలీజ్

సినిమా థియేటర్లు త్వరగా ఓపెన్ చేయాలని నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరలేదు. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా లేదు. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లాంటి వాటిపై నిషేధాన్ని కొనసాగించాలనే భావిస్తున్నారు.

షూటింగ్స్ పూర్తి చేసిన చిత్రాలను విడుదల చేసినా ఇప్పటి పరిస్థితులలో ఎలాంటి ఫలితం వస్తుందోననే ఆందోళనలోనే నిర్మాతలున్నారు.

కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కావడం, పెండింగ్ వర్క్స్ కూడా పట్టాలెక్కడంతో చివరి దశలో వున్న సినిమాలకి ప్లస్ అయింది. దీని వల్ల ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని, సెన్సార్ కూడా క్లియర్ చేసుకుంటున్నారు.

దర్శకులు, హీరోలు థియేట్రికల్ రిలీజ్ మీదే మొగ్గు చూపుతున్నారు కానీ మరో రెండు, మూడు నెలలు థియేటర్లు తెరుచుకోవంటే మాత్రం పలువురు ఓటీటీ బాట పడతారు. 

మరోవైపు పంపిణీదారులు కూడా ఎన్నారై డీల్స్ చేయడానికి ససేమీరా అంటున్నారు. ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో విడుదల చేసి పెడతామని, లోకల్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ బాగా చితికిపోయారు కనుక ముందుగా అడ్వాన్సులు ఇవ్వడం కష్టమని చెబుతున్నారు.

థియేట్రికల్ బిజినెస్ మళ్లీ గాడిన పడకపోతే కనుక చిన్న సినిమా ఓటీటీ వేదికగా విడుదల కావాల్సిందే, తప్పదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?