Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇక ఆ రెండు చాన‌ళ్లు కనిపించ‌వు

ఇక ఆ రెండు చాన‌ళ్లు కనిపించ‌వు

ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ‌గా చూసే వాళ్ల‌కు ఇది షాకింగ్ న్యూస్‌. ఇంగ్లీష్ సినిమాలు ప్ర‌సారం చేసే ప్ర‌ముఖ ఇంగ్లీష్ మూవీ చాన‌ల్స్  హెచ్‌బీఓ, డబ్యూబీ ఇక మీద‌ట భార‌త్‌లో నిలిపివేయ‌నున్నారు. అవును మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే. ఒక్క భార‌త్‌లోనే కాదు, మ‌న దాయాది దేశాలైన పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌తో పాటు మాల్దీవుల్లో కూడా ఈ రెండు చాన‌ళ్ల‌ను వార్న‌ర్ మీడియా నిలిపి వేయ‌నుంది.

ఇంత వ‌ర‌కూ ఇంగ్లీష్ సినిమాలు చూడాల‌నుకుంటే చాలు ... వెంట‌నే రిమోట్‌ను ఆ చాన‌ళ్లు వ‌చ్చే సంఖ్య‌పై నొక్కేవాళ్లు. గ‌త కొన్నేళ్లుగా ఈ రెండు చాన‌ళ్లు సౌత్ ఆసియాలో త‌మ ప్ర‌సారాల‌ను కొన‌సాగిస్తున్న‌ప్ప‌టికీ , వ్యాపార ప‌రంగా క‌లిసి రావ‌డం లేదని తెలుస్తోంది.  

హెచ్‌బీఓ, డబ్యూబీ టీవీ చాన‌ళ్ల  ప్ర‌సారాలు చూడాలంటే స‌బ్‌స్క్రైప్ కావ‌డానికి  నాలుగు నుంచి ఐదు డాలర్ల ఖర్చు అవుతుంది. కానీ మ‌న దేశంలో నామ మాత్రంగా   రెండు డాలర్లు మాత్ర‌మే. ఇదే స‌మ‌యంలో ఇత‌ర దేశాల‌తో పోల్చుకుంటే మ‌న‌దేశంలో ఈ చానళ్ల‌ను వీక్షించే వాళ్ల సంఖ్య చాలా త‌క్కువ‌ని తెలుస్తోంది.

ముఖ్యంగా   ఓటీటీ , డిస్నీ హార్ట్‌ స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఆన్‌లైన్‌ వేదికలు అందుబాటులోకి  వచ్చిన తరువాత ఈ చానళ్లపై ఎవ‌రూ పెద్ద‌గా దృష్టి పెట్ట‌డం లేద‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో  వార్నర్‌ మీడియా డిసెంబర్‌ 15 నుంచి హెచ్‌బీఓ, డబ్యూబీ ఛానళ్లను  నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే భారతదేశంలో కార్టూన్ నెట్‌వర్క్,  పోగో  ఛానళ్లలను కొనసాగించ‌నున్న‌ట్టు పేర్కొంది. ఏది ఏమైనా ఒక కొత్త వ్య‌వ‌స్థ పురుడు పోసుకుంటున్న ద‌శ‌లో, పాత వ్య‌వ‌స్థ‌లు క‌నుమ‌రుగు కావ‌డం స‌హ‌జ ప్ర‌క్రియ‌గా సినీ పెద్ద‌లు చెబుతున్నారు. 

వైయస్సార్ దగ్గర చంద్రబాబు డబ్బులు తీసుకునేవాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?