Advertisement

Advertisement


Home > Movies - Movie News

టిల్లూ స్క్వేర్.. ఓ సంచలనం

టిల్లూ స్క్వేర్.. ఓ సంచలనం

గుంటూరు కారం ను ఓ చిన్న సినిమా క్రాస్ చేస్తే ఎలా ఉంటుంది.. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ సాధించిన వసూళ్లను ఓ చిన్న సినిమా అదిగమిస్తే ఎలా ఉంటుంది.. ఇదేదో ఫాంటసీ కాదు. కళ్లముందు కనిపిస్తున్న సత్యం. చిన్న సినిమాగా వచ్చిన టిల్లూ స్క్వేర్ మూవీ ఓవర్సీస్ లో హేమాహేమీల్లాంటి పెద్ద సినిమాల్ని క్రాస్ చేసింది.

ఓవర్సీస్ లో మరికొన్ని గంటల్లో సగర్వంగా 3 మిలియన్ క్లబ్ లోకి చేరబోతోంది ఈ మూవీ. ఓ చిన్న సినిమాకు 3 మిలియన్ డాలర్ల వసూళ్లు అంటే మామూలు విషయం కాదు. చాలామంది హీరోలకు ఇప్పటికీ 1 మిలియన్ క్లబ్ అనేది ఓ కల. అలాంటిది చిన్న హీరో సిద్ధు జొన్నలగడ్డ, ఏకంగా 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరబోతున్నాడు. అట్లుంటది మరి టిల్లూతోని.

రిలీజైన మొదటి రోజు నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అదే ఊపుతో మిలియన్ క్లబ్ లోకి, ఆ వెంటనే 2 మిలియన్ క్లబ్ లోకి వెళ్లిపోయింది. ఓవైపు సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం, మరోవైపు పోటీకి వచ్చిన మరో సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో, టిల్లూ స్క్వేర్ కు ఎదురే లేకుండా పోయింది.

అలా ఇప్పటివరకు ఓవర్సీస్ లో 2.9 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన ఈ సినిమా, మరికొన్ని గంటల్లో 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరబోతోంది. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య, భీమ్లా నాయక్, పుష్ప, గుంటూరుకారం సినిమాలు ఓవర్సీస్ లో సాధించిన వసూళ్లను టిల్లూ అధిగమించాడు.

వరల్డ్ వైడ్ వసూళ్లలో ఈ సినిమా ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ మార్క్ అందుకొని, తాజాగా 125 కోట్ల గ్రాస్ కూడా సాధించింది. మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకుడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?