Advertisement

Advertisement


Home > Politics - Andhra

ధర్మానకు కీలక మద్దతు దక్కబోతోందా?

ధర్మానకు కీలక మద్దతు దక్కబోతోందా?

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఈసారి కీలక మద్దతు దక్కబోతోందా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ధర్మానకు టఫ్ ఫైట్ ప్రతీ ఎన్నికలోనూ మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబం నుంచే వచ్చేది.

గత రెండు దశాబ్దాలుగా నాలుగు ఎన్నికలు జరిగితే మూడు ఎన్నికల్లో ధర్మాన గెలిచారు. శ్రీకాకుళంలో ఆయన మీద పోటీ పడుతూ గట్టి పోటీ ఇచ్చిన గుండ ఫ్యామిలీ 2014లో ఈయనను ఓడించింది కూడా. ఇపుడు ఆ కుటుంబం నుంచి ధర్మానకు మద్దతు పరోక్షంగా దక్కబోతోంది అని టాక్ వినిపిస్తోంది.

ధర్మానకు ఆ కుటుంబానికి దూరపు బంధుత్వం ఉంది. అయినా రాజకీయాల్లో ప్రత్యర్థులే గానే ఉంటూ వచ్చారు. అరసవిల్లికి చెందిన గుండ కుటుంబం ఉన్న చోట ధర్మాన ప్రచారం చేయకుండా కొన్ని విలువలు పాటిస్తూ వచ్చారు.

అలా ఎంతటి ప్రత్యర్ధులు అయినా ఒకరి మీద ఒకరు విమర్శలు వ్యక్తిగతంగా చేసుకోకుండా హుందా అయిన రాజకీయమే ఆనాడు నడిపారు. ఇపుడు ఆ కుటుంబాన్ని టీడీపీ దూరం పెట్టింది. రెబెల్ గా పోటీ చేయమని ఒత్తిడి వచ్చినా గుండ కుటుంబం మాత్రం విలువలకు కట్టుబడి అలా మౌనం వహించింది.

అయితే చూస్తూ చూస్తూ తమ బలాన్ని వీక్ చేసుకోలేమని ఆ కుటుంబం అనుచరులు అభిమానులు చెబుతున్నారు. వారంతా టీడీపీ కంటే వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అని ప్రచారం సాగుతోంది. దాంతో ధర్మానకు అనూహ్యంగా ఈ మద్దతు లభిస్తోంది. ఈ విషయం తెలిసిన టీడీపీ పెద్దలు వైసీపీలో ఉన్న కొందరు కీలక నేతలను తమ వైపు తిప్పుకున్నారు.

వైసీపీ నుంచి ఎవరు వెళ్లినా గుండ కుటుంబానికి ఉన్న వేలాది అభిమానులు మాత్రం ఈసారి టీడీపీకి చుక్కలు చూపిస్తారు అని అంటున్నారు. వారి ఓటు ఇపుడు కీలకంగా మారుతోంది. చాలా కాలం తరువాత అరసవిల్లిలో మీటింగ్ పెట్టిన ధర్మానకు మంచి స్పందన లభించడమే అందుకు  నిదర్శనం.

ఈసారి ధర్మానకు భారీ మెజారిటీ ఖాయం అని వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఇవే చివరి ఎన్నికలు అని ధర్మాన చెబుతూ వచ్చారు. దాంతో ఆయన ఈ ఎన్నికలల్లో అద్భుతమైన విజయమే సాధిస్తారు అని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?