డీజే టిల్లూ సినిమాలో ఓ స్థాయి వరకు వచ్చి ఆగిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ కథకు అంతే చాలని ఫీలయ్యాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో టిల్లూ స్క్వేర్ లో మాత్రం బౌండరీస్ దాటేశాడు. ఎంతలా అంటే.. ట్రయిలర్ లోనే సుదీర్ఘమైన లిప్ కిస్ సీన్ చూపించేంతలా.
తన టార్గెట్ ఆడియన్స్ ఎవరో సిద్ధు జొన్నలగడ్డకు బాగా తెలుసు. అందుకే వాళ్లను దృష్టిలో పెట్టుకొని సినిమా తీసినట్టున్నాడు. ట్రయిలర్ చూస్తే అదే విషయం అర్థమౌతుంది. ఏకంగా మూడున్నర నిమిషాల ట్రయిలర్ కట్ చేసి వదిలాడు.
సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది.. మరీ ముఖ్యంగా 'రాధిక'ను రీప్లేస్ చేసిన అనుపమ పాత్ర ఎలా ఉండబోతోందనే విషయాన్ని క్లియర్ గా చెప్పారు ట్రయిలర్ లో.
అనుపమ పరమేశ్వరన్ ను ఈ తరహా పాత్రలో ప్రేక్షకులు చూడడం ఇదే తొలిసారి. నిరభ్యంతరంగా లిప్ కిస్ సన్నివేశాల్లో నటించిన ఈ హీరోయిన్, ఐకానిక్ కార్ సీన్ లో కూడా 'రాధిక'ను మరిపించింది. సినిమాలో మరిన్ని మూతి ముద్దులున్నాయనే విషయాన్ని కూడా ట్రయిలర్ లో పరోక్షంగా వెల్లడించారు.
ఇక సిద్ధు విషయానికొస్తే, టైటిల్ కు తగ్గట్టే టిల్లూ స్క్వేర్ లో మరింత వినోదాన్ని, ఇంకాస్త యాక్షన్ ను అందివ్వబోతున్నాడనే విషయం కనిపిస్తూనే ఉంది. మల్లిక్ రామ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. మార్చి 29న థియేటర్లలోకి రాబోతున్నాడు టిల్లూ.