మహేష్-త్రివిక్రమ్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చకచకా జరుగుతోంది. దర్శకుడు త్రివిక్రమ్, ఈ పని మీదే బిజీగా వున్నారు. జూన్ నెల నుంచి ప్రారంభించేయాలన్నది ఆలోచన. సరే కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది ఎంత ఫాస్ట్ గా చేయాలనుకున్నా. మరి ఇంతకీ విడుదలకు డేట్ ఎక్కడ వుంది?
ఈ ఏడాది దసరా, డిసెంబర్ నాటికి పుష్ప 2 రెడీ చేసే ఆలోచనలో వున్నారు.
2023 సంక్రాంతికి చాలా సినిమాలు రుమాలు వేసి వున్నాయి.
2023 సమ్మర్ కు శంకర్-రామ్ చరణ్ సినిమా విడుదల చేస్తారు.
ప్రభాస్ సినిమాలు ఈ దసరా నుంచి వచ్చే సంక్రాంతి మీదుగా సమ్మర్ వరకు లైనప్ లో వున్నాయి.
వచ్చే సమ్మర్ వేళకు బాలయ్య, చిరంజీవి ల సినిమాలు కూడా వుండే అవకాశం వుంది.
ఇలా చాలా టైట్ గా వుంది పొజిషన్. గతంలో మాదిరిగా రెండు వారాల గ్యాప్ ఇప్పడు సరిపోతున్నట్లు కనిపించడం లేదు.. టికెట్ రేట్లు పెరగడంతో మిడిల్ క్లాస్ జనం నెలకు ఓ సినిమా అనే లెక్కలు పెడుతున్నట్లు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది.
మొత్తం మీద సినిమా చేతిలోకి రావడం, ఫినిష్ చేయడం కన్నా సరియైన విడుదల డేట్, సరైన సీజన్ కీలకం అయిపోయింది ఇప్పుడు టాలీవుడ్ కు.