టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారాల మీద చాలా రచ్చే జరిగింది. నోటీసులు, విచారణలు, ఇంకా ఇంకా…కానీ అంతా అక్కడితో సరి. క్లీన్ చిట్ కూడా వచ్చేసినట్లే. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది.
డ్రగ్స్ వ్యవహారాలలో విదేశీ డబ్బు లావాదేవీలు కూడా వుండడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ రంగ ప్రవేశం చేసింది. కానీ ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు. అయితే ఈడీ ఊరుకోకుండా కోర్టుకు ఎక్కింది. ఈడీ కావాల్సిన వివరాలు, కాల్ రికార్డులు, ఇవ్వమని కోర్టు ఆదేశించినా ఫలితం దక్కలేదు.
అయినా ఈడీ పట్టు వీడలేదు. కోర్టు ధిక్కరణ అంటూ మళ్లీ తన ఫైట్ మొదలు పెట్టింది. కోర్టు ధిక్కరణ ఆరోపణపై వివరణ ఇవ్వమని తెలంగాణ సిఎస్ ను కోర్టు ఆదేశించింది. పది రోజులు గడువు ఇచ్చింది.
ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కేసులో వున్నవారి కాల్ రికార్డులు, వారి నుంచి సేకరించిన డిజిటల్ రికార్డులు అన్నీ ఈడీ కి ఇస్తుందా? లేక కేవలం కోర్టుకు వివరణ మాత్రమే ఇస్తుందా అన్నది చూడాలి.
ఒక వేళ కోర్టు పట్టుపట్టి, తన ఆదేశాలు అమలు అయ్యేలా చూస్తే మాత్రం టాలీవుడ్ జనాలు సూప్ లో పడినట్లే. డ్రగ్స్ కేసులో వున్నవారి కాల్ రికార్డులు, డిజిటల్ రికార్డులు ఈడీ చేతికి అందితే కత వేరే వుంటుంది.