డ్రగ్స్ తో పట్టుబడిన టాలీవుడ్ హీరో ప్రేయసి?

హైదరాబాద్ కు డ్రగ్స్ కొత్త కాదు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొంతమంది ప్రముఖులు కూడా అరెస్ట్ అవుతున్న దాఖలాలున్నాయి. తాజాగా అలాంటిదే మరో…

హైదరాబాద్ కు డ్రగ్స్ కొత్త కాదు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొంతమంది ప్రముఖులు కూడా అరెస్ట్ అవుతున్న దాఖలాలున్నాయి. తాజాగా అలాంటిదే మరో అరెస్ట్ జరిగింది.

గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న లావణ్య అనే అమ్మాయిని హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర్నుంచి స్వల్ప మొత్తంలో మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 4 గ్రాములు ఎండీఎంఏ అది.

కేవలం 4 గ్రాములే కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మేటర్ అది కాదు. పోలీసులు అదుపులోకి తీసుకున్న లావణ్య అనే అమ్మాయి ఇక్కడ హాట్ టాపిక్. టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ మోస్తరు క్రేజ్ తో కొనసాగుతున్న హీరోకు ఈమె గర్ల్ ఫ్రెండ్.

ఆమెకు టాలీవుడ్ తో మంచి సంబంధాలున్నాయనే విషయం పోలీసుల విచారణలో తేలింది. అదే క్రమంలో ఆమె ఓ టాలీవుడ్ హీరోకు ప్రేయసి అనే విషయాన్ని పోలీసులు కనుగొన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆమె పోలీసులకు దొరకడం ఇదే తొలిసారి కాదంట. గతంలో కూడా ఆమెపై ఓ కేసు నమోదైందని చెబుతున్నారు. ఆ టాలీవుడ్ హీరో ఎవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా అతడు ఓ మల్టీస్టారర్ మూవీలో కూడా నటించాడంట.