టాలీవుడ్ లో మళ్లీ అయోమయం

ఆర్ఆర్ఆర్..కేజీఎఫ్ 2 లాంటి రెండు సినిమాలను చూసిన తరువాత టాలీవుడ్ లో మళ్లీ అయోమయ పరిస్థితి నెలకొంది. చిన్న, మీడియం సినిమాలు విడుదల చేయాలంటే భయపడుతున్నారు. కానీ విడుదల చేయక తప్పదు కదా అని…

ఆర్ఆర్ఆర్..కేజీఎఫ్ 2 లాంటి రెండు సినిమాలను చూసిన తరువాత టాలీవుడ్ లో మళ్లీ అయోమయ పరిస్థితి నెలకొంది. చిన్న, మీడియం సినిమాలు విడుదల చేయాలంటే భయపడుతున్నారు. కానీ విడుదల చేయక తప్పదు కదా అని ధైర్యం చేస్తున్నారు. 

రాబోయే వారం మూడు చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ ఇంకా అనేక చిన్న మీడియం సినిమాలు విడుదలకు రెడీగానో, రెడీ అయిపోతూనో వున్నాయి. కానీ కొన్నాళ్లు పరిస్థితి చూసిన తరువాత విడుదల చేయాలని అనుకుంటున్నారు.

దీనికి ఒక కారణం అని కాదు. చాలా రీజ‌న్లు వున్నాయి. ఆంధ్రలో ఎగ్జామ్స్ సీజ‌న్ అంతా కలగాపులగం అయిపోయింది. ఏప్రిల్ ఎండింగ్ నాటికి దాదాపు అన్ని రకాల పరీక్షలు పూర్తయ్యేవి. కేవలం కాంపిటీటివ్ పరిక్షలు మాత్రం వుండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. కరోనా మూడో వేవ్ కారణంగా అంతా మారిపోయింది. ఇప్పుడు ఇంకా టెన్త్ పరిక్షలు అవుతున్నాయి. మే అంతా కూడా పరిక్షల వ్యవహారం వుంటుందని ఇప్పటి వరకు వున్న వార్తలను బట్టి వినిపిస్తోంది.

దీనివల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు థియేటర్లకు దూరంగా వున్నాయి. దానికి తోడు పెరుగుతున్న టికెట్ రేట్లు మరోపక్క చిన్న, మిడ్ రేంఙ్ సినిమాను థియేటర్ కు దూరం చేస్తున్నాయి. గని సినిమా విషయంలో ఇది ప్రాక్టికల్ గా రుఙవయింది. ఓటిటి అన్నది కూడా గట్టి ప్రభావమే చూపిస్తోంది. మరోపక్కన ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోతున్నట్లు కనిపిస్తోంది. అయితే భారీ సినిమాలు లేదా, పూర్తి ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తప్పితే మిడ్ రేంజ్ సినిమాలు ప్రమాదకరంగా మారుతున్నాయి.

అయితే పది కోట్ల సినిమాలు, లేదా భారీ సినిమాలు సేఫ్ జోన్ గా వుంటున్నాయి తప్ప, ముఫై, నలభై కోట్ల రేంజ్ సినిమాలు పూర్తి రిస్క్ గా మారిపోతున్నాయి. అందుకే ఆ రేంజ్ సినిమాలు ప్లాన్ చేయడానికి జంకుతున్నారు. సరైన కాంబినేషన్ ధీమా వుంటే తప్ప అటు దృష్టి పెట్టడం లేదు.

కానీ ఈ పరిస్థితులు అన్నీ మెల మెల్లగా చక్కబడతాయని, అన్నీ మళ్లీ నార్మల్ గా మారతాయని, టాలీవుడ్ జ‌నాలు నమ్ముతున్నారు. అదే ధైర్యంతో, నమ్మకంతోనే చిన్న, మీడియం సినిమాలు అన్నింటినీ హోల్డ్ చేసి వుంచుతున్నారు. చిన్న, పెద్ద సినిమాలు అన్నీ జూన్ ఆ తరువాత ప్లేస్ మెంట్ కోసం చూస్తున్నాయి.

సర్కారువారిపాట, ఎఫ్ 3, లైగర్, లాంటి పెద్ద సినిమాలు ఇక కొన్నే వున్నాయి. అవి అయిపోతే కాస్త గ్యాప్ ఇచ్చిన తరువాత చిన్న, మీడియం సినిమాలు విడుదల ప్లాన్ చేయాలని టాలీవుడ్ జ‌నాలు చూస్తున్నారు.